సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినిమాల గురించి, తన కూతురు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.మహేష్ బాబు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీ సినిమాలో హీరోయిన్ లతో కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు విలన్లతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు మీ పిల్లల రియాక్షన్ ఏంటి అని అడిగారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు సమాధానం చెబుతూ.
గౌతమ్ సితార ఇద్దరికీ సినిమా చూస్తున్న సమయంలో ఫైట్ సన్నివేశాలు వచ్చాయంటే వారికి నచ్చవు.ఇక సితార అయితే ఆ సన్నివేశాలు వచ్చే సమయంలో అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతుంది.
ఇక నా సినిమాలు విడుదలైన రోజే ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తానని మహేష్ బాబు తెలిపారు.
సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టపడి సినిమా చిత్రీకరిస్తాం.
అయితే ఆ సినిమా ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు ఆ సినిమాలో పడిన కష్టం మొత్తం వెళ్ళిపోతుంది అంటూ మహేష్ బాబు తన కుటుంబం తన పిల్లల గురించి తెలిపారు.మీ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తారా అన్న ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ పూర్తిగా వారి నిర్ణయానికి వదిలేస్తాము.
వారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాము అంటూ వెల్లడించారు.