ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున టైం ప్రస్తుతం అస్సలు బాగాలేదు.జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వారికి నచ్చేలా సినిమాలు చేస్తానని చెప్పిన నాగార్జున.అసలు ఏం సినిమాలు చేస్తున్నాడో తనకే తెలియడం లేదు.2016లో వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమా తర్వాత ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.అయితే తను తాజాగా నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఆ సినిమా మీదే ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఈ సినిమా గనుక అటు ఇటు అయితే ఆయన కెరీర్ ఫినిష్ అని చెప్పుకోక తప్పదు.సోగ్గాడే చిన్నినాయనకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమా ఒక వేళ జనాలను అలరించకపోతే పరిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు నాగార్జునతో పాటు ఆయన అభిమానుల సంశయం.
నాగార్జున- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా నాగార్జున కంటే కార్తికి ఎక్కువ పేరు తెచ్చింది.సినిమా అంతా తను వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు.
దీంతో ఆయనను జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేదు.అటు శ్రీకాంత్ కొడుకు రోషన్.
సినిమా నిర్మలా కాన్వెంట్ సినిమాలో తన నిజ జీవిత పాత్రను పోషించాడు.అయినా తనకు ఏ మేలు కలగలేదు.

ఓం నమో వేంకటేశాయ, రాజుగారి గది 3, ఆఫీసర్ సహా వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.నాగ్ కెరీర్ లోనే ఆఫీసర్ చెత్త డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.దేవదాస్ మూవీ చేసినా అంతగా ఆకట్టుకోలేదు.మన్మథుడు-2 కూడా అంతగా ఆకట్టుకోలేదు.వైల్డ్ డాగ్ కూడా అంతగానే ఆడింది.2022 సంక్రాంతికి బంగార్రాజు సినిమా జనాల ముందుకు రానుంది.ఈ సినిమా కనుక ప్లాప్ అయితే.ఆయన కెరీర్ కు ఫుల్ స్టాప్ పడటం కామన్ అనే టాక్ నడుస్తుంది.ఆయన భవిష్యత్ ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.