ఎవరూ ఊహించని నిర్ణయం.ఏపీ రాజకీయాలను ఉలిక్కి పడేలా చేసిన ప్రకటన.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఘటన.అదే మూడు రాజధానులపై జగన్ ఉపసంహరణ ప్రకటన.
గత ఏడాదికి పైగా అమరావతి రైతులు ఈ బిల్లులను రద్దు చేయాలంటూ ధర్నాలు చేస్తూనే ఉన్నారు.అయినా అప్పటి నుంచి పెద్దగా స్పందించని జగన్ ఒక్కసారిగా రద్దు తీర్మానం అంటూ అందరినీ షాక్ కు గురి చేశారు.
అయితే ఇక్కడే ఆయన ఓ పెద్ద కన్ఫూజన్ క్రియేట్ చేశారు.అసలు రాజధాని ఏది అంటే మళ్లీ చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారు.
మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్టు చెబుతూనే మళ్లీ మార్పులతో సభ ముందుకు వస్తామంటూ ప్రకటించారు.అంటే అమరావతిలోనే రాజధాని ఉంటుందా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటికిప్పుడు విస్తృత ప్రయోజనాలను రక్షించేందుకు బిల్లులను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పేశారు.కానీ త్వరలోనే కొత్త బిల్లు తెస్తామని చెప్పడంతో ఆయన ప్లాన్ ఎవరికీ అర్థం కావట్లేదు.
నిజానికి హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు ఎక్కువ అవుతున్నాయి.అవి జగన్ ఇమేజ్ ను డౌన్ చేస్తున్నాయి.
దీంతో కోర్టు కూడా మూడు రాజధానుల బిల్లుపై సీరియస్ గానే ఉంది.

ఈ పరిస్థితుల నడుమ కోర్టు ఒకవేళ రద్దు చేయాలని తీర్పు ఇస్తే తమ స్థాయి పడిపోతుందని.అందుకే ముందే తామే రద్దు చేసి ప్రజల్లో ఆదరణను నిలబెట్టుకోవచ్చని జగన్ ప్లాన్.ఇదే సమయంలో మరో కొత్త బిల్లును తేవడం కూడా జగన్ కు అత్యవసరం అయింది.
ఈ కొత్త బిల్లుపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా ఉంటుందని జగన్ భావిస్తున్నారంట.అన్ని రకాల చర్యలు ముందే తీసుకుని సభ ముందుకు తేవాలని జగన్ చూస్తున్నారంట.
ఈ బిల్లు కూడా జగన్ ఆకాంక్షలకు తగ్గట్టుగానే ఉంటుందని తెలుస్తోంది.మొత్తానికి గ్యాప్ ఇచ్చి మళ్లీ తన మార్కును చూపెట్టేందుకు జగన్ రెడీ అవుతున్నారన్నమాట.