టీ20 ప్రపంచ కప్ 2021 లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.గత కొన్నేళ్లుగా మెగా టోర్నీలో చతికిల పడుతున్న ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచులో అన్ని జట్లను ఓడించి తన సత్తా చాటింది.2007లో మొదటి టీ 20 వరల్డ్ కప్ జరగగా.ప్పట్నుంచి ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నం ఆదివారం ఫలించింది.
14 ఏళ్లుగా తమకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్ ను సగర్వంగా ముద్దాడింది.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో న్యూజిలాండ్ జట్టుపై ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు 2021 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది.
అయితే మొదటిసారి ఫైనల్స్ కు చేరినా న్యూజీలాండ్ కు నిరాశే ఎదురైంది.అయితే ఆస్ట్రేలియా ఈ విజయం సాధించడానికి జట్టు సమిష్టి కృషే కారణం.

టీ20 ప్రపంచ కప్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.తొలిసారి తమ దేశానికి పొట్టి ప్రపంచ కప్ అందించడంతో రచ్చ రచ్చ చేశారు.తమ డ్రెస్సింగ్ రూములో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.కాలికి ఉన్న షూస్ తీసి అందులో బీరు పోసుకుని తాగుతూ తెగ ఎంజాయ్ చేశారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ మాత్యు వెడ్.ఏకంగా తన షూలో బీరు పోసుకుని తాగగా.
ఆ తరువాత ఆల్ రౌండర్ స్టోనీస్ కూడా అదే షూ లో బీరు పోసుకుని తాగుతూ కనిపించాడు.
ఇంకపోతే ఇందుకు సంబంధించిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసిసి ట్విటర్, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా మ్యాథ్యూ వెడ్ స్టోయినీస్ షూలో బీరు తాగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.