బిగ్ బాస్ సీజన్ 5లో 9వ వారం ఎలిమినేషన్ పూర్తయింది.ముందు లీక్ అయినట్టుగానే హౌజ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ విశ్వ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేశాడు.
అయితే ఈ ఎలిమినేషన్ పై ఆడియెన్స్ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు.హౌజ్ లో బాగా టాస్క్ లు ఆడుతూ హౌజ్ లో అందరి చేత సూపర్ అనిపించుకున్న విశ్వ ఎలిమినేట్ అవడంపై బిగ్ బాస్ ఆడియెన్స్ కొద్దిగా ఫీల్ అవుతున్నారు.
అయితే ఆడియెన్స్ ఓటింగ్స్ ద్వారానే ఎలిమినేషన్ జరుగుతుంది.ఈ క్రమంలో విశ్వకు అందరి కన్నా తక్కువ ఓట్లు రాబట్టే ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.హౌజ్ లో కేవలం తన కండబలంతో టాస్క్ లు మాత్రమే ఆడటం కాదు బుద్దిబలంతో స్క్రీన్ స్పేస్ కూడా తీసుకోవాలనే లాజిక్ మిస్ అయ్యాడు విశ్వ.అందుకే టాస్కుల్లో వీరోచితంగా ఆడినా అతన్ని ఆడియెన్స్ గుర్తించలేదు.
ఫైనల్ గా 9వ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేరు.ఆడియెన్స్ ఓటింగ్ మీదనే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పొచ్చు.