బాలయ్య అఖండ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.

 Balakrishna, Tollywood, Hero, Akhanda, Movie Release, Film Industry,tollywood N-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకుడు భావించారు.

అయితే అది కుదరని పక్షంలో దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ అఖండ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు సమాచారం.త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడనునట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కనిపించనున్నారు.ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో సందడి చేయనున్నట్లు తెలిసిందే.

Telugu Akhanda, Balakrishna, Tollywood-Movie

ఇప్పటికే బోయపాటి శీను, బాలకృష్ణ దర్శకత్వంలో సింహా, లెజెండ్ వంటి చిత్రాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి రాబోతున్న ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమా విడుదల పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube