టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బీజేపీ భలే వ్యూహం.. అదేంటంటే?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బీజేపీకి అంతగా బలం లేనటువంటి పరిస్థితి.

 Bjp Strategy Against Trs, Trs, Huzurabad Elections, Bandi Sanjay, Bjp, Trs Vs Bj-TeluguStop.com

కాని దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం తరువాత బీజేపీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా మారుమ్రోగి పోయిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు ఒకవేల హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ సత్తా చాటితే టీఆర్ఎస్ కు కొంత గడ్డు పరిస్థితులు మాత్రం ఎదురుకాబోతున్నవని మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే టీఆర్ఎస్ ను బలంగా బీజేపీ ఎదుర్కోలేక పోతే క్షేత్ర స్థాయిలో బలపడటం చాలా కష్టం.అందుకే బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కోవడంపై దృష్టి పెట్టింది.

అందుకు బీజేపీ భలే వ్యూహం పన్నింది.ప్రస్తుతం టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే దిశగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకున్న నేపథ్యంలో ఇక  ఈ కార్యచరణను వేగవంతం చేసి ఇక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించేలా ఒక క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని త్వరలో బీజేపీ తీసుకరానుంది.

దీంతో టీఆర్ఎస్ కు ఉన్న బలాన్ని క్షేత్ర స్థాయి నుండి బలహీనపర్చవచ్చు అనేది బీజేపీ వ్యూహం.అంతేకాక భవిష్యత్తులో  టీఆర్ఎస్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం ఉంది.

Telugu Bandi Sanjay, Bjp, Cm Kcr, Huzurabad, Akarsh Trs, Telangana, Trs Bjp-Poli

దీంతో టీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో సంకటంలోకి నెట్టి, తన పార్టీని నిలబెట్టుకోవడానికే కెసీఆర్ దృష్టి పెట్టే విధంగా రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసి బీజేపీ ఇక ప్రధాన మైన అంశాల పట్ల దృష్టి పెట్టే అవకాశం ఉంది.తద్వారా టీఆర్ఎస్ కంటే బీజేపీ అగ్ర స్థానంలో ఉందని ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెళ్ళే అవకాశం వందకు వంద శాతం ఉంది.మరిన్ని రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube