టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల పై దాడులు జరగడం తో.
చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపడితే ఉండగా.మరోపక్క వైసీపీ పార్టీ నేతలు.సీఎం జగన్ కి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా.“జనగ్రహ” దీక్షలు చేపడుతున్నారు.ఇటువంటి తరుణంలో డ్రగ్స్ సరఫరా అంటూ.చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల… విశాఖలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ స్పందించారు.సాక్షాత్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన క్యాబినెట్ లో.ఇద్దరు మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారని పేర్కొన్నారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు గంజాయి స్మగ్లర్ అని అప్పట్లో అదే క్యాబినెట్ కు చెందిన మరొక మంత్రి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.అటువంటి స్మగ్లర్లను చుట్టుపక్కల పెట్టుకున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.
ఎక్కడో షిప్ దొరికింది.దానికి ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టే రీతిలో .చంద్రబాబు ఆరోపణలు చేయటం దారుణమని అన్నారు.స్వయంగా కేంద్రమే ఏపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
దమ్ముంటే నిరూపించండి.? నిజమైతే.రాజకీయాల నుండి తప్పుకుంటా అని మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ కి చాలెంజ్ విసిరారు.