తెలుగు బిగ్ బాస్ నాల్గవ వారం ముగింపు దశకు వచ్చేసింది.మరి కొన్ని గంటల్లో నాల్గవ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అనేది అఫిషియల్ గా రాబోతుంది.
బిగ్ బాస్ నుండి ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా ఉంది.
నటరాజ్ మాస్టర్ కు తక్కువ ఓట్లు వచ్చాయని ఇప్పటికే స్టార్ మా వర్గాల వారు అంటున్నారు.ఆయనకు తక్కువ మార్కులు రావడం మాత్రమే కాకుండా ఆయన ప్రవర్తన మరీ చిరాకు పెట్టే విధంగా ఉంది.
అందుకే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా ఖాయం అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ కు షూటింగ్ జరుగుతోంది.
ఇప్పటికే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది క్లారిటీ వచ్చింది.కాని అధికారికంగా ఆదివారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది.
బిగ్ బాస్ నాల్గవ వారంలో నటరాజ్ మాస్టర్ కు మూడినట్లే అంటూ మొదటి నుండి అంతా నమ్మకంగా చెబుతున్నారు.అనుకున్నట్లుగానే ఆయన ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈమద్య కాలంలో వచ్చిన లీక్స్ అన్ని కూడా నిజం అయ్యాయి.కనుక నాల్గవ వారం ఎలిమినేషన్ కూడా నిజం అయ్యి ఉంటుంది అనేది చాలా మంది వాదన.
ఈ విషయంలో మరింత స్పష్టత రావాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది.ఇక ఈ వారంలో షన్ను మరియు సిరి లకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చాడు
జెస్సీ ని కెప్టెన్ గా వరస్ట్ అన్నారు.కాని ఆయన్ను బిగ్ బాస్ తో పాటు నాగార్జున వెనకేసుకు వచ్చాడు.కెప్టెన్ గా వ్యవహరించిన జెస్సీకి ఇంటి సభ్యులు మద్దతు ఇవ్వలేదు.
ఆయన కాకుండా మరెవ్వరు అయినా ఇంటి విధుల నిర్వహణలో బాధ్యత యుతంగా వ్యవహరించలేదు అంటూ అందరిపై కూడా నాగార్జున సీరియస్ అయ్యాడు.బిగ్ బాస్ నాల్గవ వారం ముగియడంతో ఆట మరింత ఆసక్తికరంగా మారబోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.