తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఆయన పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.
ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఇప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా యంగ్ హీరోలతో పోటీగా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.
ఇదిలా ఉంటే తెలుగు ప్రజలకు ఆ విషయం తెలవద్దు అంటూ రాధిక నోరు మూయించాడు చిరు.
అలనాటి నటి రాధిక గురించి ఈ తరం ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయపాత్రలలో మెప్పిస్తుంది.ఇక ఈమె చిరంజీవితో కలిసి చాలా సినిమాలలో నటించింది.
చిరంజీవికి, రాధిక కు మధ్య మంచి స్నేహ బంధం ఉందనే చెప్పాలి.ఏ ఈవెంట్ లో కలిసిన కూడా వీరిద్దరూ మంచి స్నేహభావంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటారు.
ఇదిలా ఉంటే గతంలో ఓ సినీ ఈవెంట్ లో సినీ ప్రముఖలు అందరూ హాజరవ్వగా అందులో చిరంజీవి, రాధిక లు కూడా హాజరయ్యారు.
ఇక ఆ ఈవెంట్ లో యాంకర్ వచ్చి వారిద్దరిని కొన్ని విషయాలను పంచుకోమన్నారు.
అంతేకాకుండా వారితో పాటు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కూడా జాయిన్ అయ్యి బాగా సందడి చేశాడు.రాధికకు చిరంజీవిని చూడగానే అభిలాష సినిమాలో బంతి చామంతి అనే పాట గుర్తుకొస్తుంది అని తెలిపింది.
చిరంజీవితో తన వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఉందని చిరంజీవితో కలిసి 25 సినిమాలలో నటించాను అంటూ తెలిపింది.ఇక హీరో హీరోయిన్లుగా దాదాపు పదిహేను సినిమాలు చేశామని తెలిపింది.
![Telugu Clash, Clashradhika, Chiranjeevi, Radhika, Tollywood-Movie Telugu Clash, Clashradhika, Chiranjeevi, Radhika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/09/megastar-chiranjeevi-radhika-tollywood-clash.jpg )
అభిలాష సినిమా సమయంలో తమ మధ్య చిన్న గొడవ జరిగిందని తెలిపింది.ఆ సినిమాలో నవ్వింది మల్లెచెండు అనే పాట చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి, తను కొట్లాడుకున్నామని తెలిపింది.ఆ సమయంలో తమ మధ్య మాటలు లేవని అందుకు ఒక చిన్న కారణం ఉందని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలుగు ప్రజలకు తెలియడం అవసరమా అంటూ తన నోరు మూయించాడు చిరు.
![Telugu Clash, Clashradhika, Chiranjeevi, Radhika, Tollywood-Movie Telugu Clash, Clashradhika, Chiranjeevi, Radhika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/09/megastar-chiranjeevi-radhika-tollywood.jpg )
రాధిక మాత్రం చిరు మాటలు పట్టించుకోకుండా తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటూ కౌంటర్ వేసింది.ఇక చిరంజీవి అంటే తనకు గౌరవమని.ఆయన తనను బాగా ప్రోత్సహించారని తెలిపింది.
నటిగా మంచి గుర్తింపు ఇచ్చాడు అంటూ చిరంజీవి గురించి పొగిడింది.ఇక డైరెక్టర్ కోదండరామి రెడ్డి మాట్లాడగా.
తనకు చిరంజీవి, రాధిక ను చూస్తే బంతి చామంతి తో పాటు నవ్వింది మల్లెచెండు అనే పాట కూడా గుర్తొస్తుంది అని తెలిపాడు.సినిమా థియేటర్లలో మాత్రం ఈ పాటకు యూత్ డాన్సులు కూడా చేశారని అందుకే తనకు ఈ పాట అంటే ఇష్టమని తెలిపాడు.
ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు చిరు.