మనకు తెలిసిన జాబుల్లో ఏ జాబు సెలవుల పరంగా బెటర్ అంటే ప్రతి ఒక్కరు కూడా టీచర్ జాబ్ లేదంటే లేదంటే సెకండ్ ప్లేస్ లో బ్యాంక్ అని చెప్తారు.వాస్తవానికి టీచర్లకు వచ్చినన్ని సెలవులు మరెవరికీ రాలేవేమో అనిపిస్తుంది.
పైగా చెప్పాలంటే టీచర్ జాబులో చాలా వసతులతో పాటు సరిపోయేన్ని సెలువలు కూడా ఉంటాయి.అందుకే చాలామంది సెలవుల పరంగా ఈ జాబులను ఎంచుకోవడానికి ఇష్టపడుతారు.
ఇందులో మంచి జీతంతో పాటు మనకు అవసరం ఉన్నన్ని వసతులు కూడా కల్పించుకోవచ్చు.అందుకే ఈ ఉద్యోగాలకు అంత డిమాండ్.
ఇకి లాంటి జాబులు వస్తే ఎవరు కాదంటారు.కాగా ఇప్పుడు ఓ టీఆచర్ మాత్రం ఇవన్నీ సరిపోవన్నట్టు ఏకంగా 769 రోజులు లీవ్ పెట్టేశాడు.అదేంటి పెడితే వారం పది రోజులకన్నా ఎక్కువ ఎవరు పెడుతారు ఏంగా ఇన్ని రోజులు ఎందుకు పెట్టాడా అని అందరూ డౌట్ పడ్డారు.కాగా అసలు అలా ఎందుకు పెట్టాడో తెలుసుకుని అందరూ షాక్ అయిపోయారు.
ఇటలీ పోర్డెనోన్‌లోని స్కూల్ లో టీచర్ ఉద్యోగం సంపాదించాడు స్కైవింగ్.అయితే ఆయన మొదట్లో బాగానే క్లాసులు చెప్పేవాడు.
కానీ కొద్ది రోజులు పోయాక ఏవో ఒక సాకు చెప్పి సెలవులు పెట్టడం ప్రారంభించాడు.
ఇలా అతను కేవలం మూడేండ్ల టీచర్ కెరీర్‌లో 769 సెలవులు పెట్టాడు.
అయితే అతడు వీలు కుదిరినప్పనుడల్లా సెలవులు కావాలని కోరడంతో యాజమాన్యం మెడికల్ సర్టిఫికేట్‌ను అడగ్గా దానికక అతడు ఒప్పుకోలేదు.దీంతో ఆ టీచర్‌పై అనుమానం వచ్చి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది స్కూల్ యాజమాన్యం.అయితే పోలీసుల విచారణలో అతను ఈ సెలవు దినాల్లో పలు కంపెనీలలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేసి దాదాపు రూ.83 లక్షలు సంపాదించాడని తెలసింది.అంతేకాదు ఫేక్ లీవుల పేరుతోని స్కూల్ నుంచి ఇప్పటి వరకు రూ.11 లక్షలు క్లెయిమ్ చేయడం పెద్ద సంచలనం రేపుతోంది.ఇక ఆయనపై కోర్టు కేసు పెట్టింది స్కూల్.