వైరల్: నీరజ్ చోప్రా మెడల్ పై సోషల్ మీడియాలో మాజీ టీమిండియా ఆటగాళ్ళ రచ్చ..!

భారత్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.వంద సంవత్సరాల నాటి కలను సాకారం చేసుకుంది.

 Harbajan Singh Viral Comments On Neeraj Chopra Gold Medal Gautam Gambhir Fires ,-TeluguStop.com

ఇండియా ఒలింపిక్స్ హిస్టరీలోనే శతాబ్దం పాటు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.భారత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది.

అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.ఆఖరి రౌండ్‌ లో జావెలిన్‌ ను 87.58 మీటర్ల దూరం వరకూ విసిరి ఈ ఘనతను సాధించాడు.మిగిలినవాళ్లు నీరజ్ సాధించినది చేయలేకపోయారు.2008వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్‌ జరిగాయి.అందులో అభినవ్ బింద్ర గోల్డ్ సాధించాడు.

ఆయన తర్వాత నీరజ్ గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు.దీంతో అతను గోల్డ్ మెడల్ సాధించిన రెండో ఇండియన్ గా నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పాడు.

నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో దేశం మొత్తం హర్షం వ్యక్తి చేసింది.చాలా మంది సెలబ్రిటీలు, అథ్లెట్లు అతడ్ని ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.

ఈ తరుణంలో హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.హర్బజన్ సింగ్ ట్వీట్ కు మాజీ క్రికెటర్ అయిన గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు.

ఆ ట్వీట్ ఎందుకు పెట్టావంటూ హర్బజన్ మీద గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నీరజ్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల హర్బజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఆ టైంలో హర్బజన్ వివాదాస్పదంగా మారాడు.

టీమిండియా క్రికెట్ జట్టు 2011వ సంవత్సరంలో ప్రపంచ కప్ సాధించిందని దాని కంటే నీరజ్ సాధించినది చాలా గొప్పది అని వ్యాఖ్యలు చేశాడు.ఓ వైపు నీరజ్ చోప్రాను పొగుతూనే ఉన్నాడు.మరోవైపు టీమిండియా క్రికెట్ జట్టు విజయాన్ని అపహాస్యం చేయసాగాడు.

ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో హర్బజన్ వ్యాఖ్యలను చాలా మంది క్రికెటర్లు చూశారు.దానిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు.

ఆ మాటలు అంటూనే గంభీర్ నోర్మూసుకోని ఉండే అనేటటువంటి ఎమోజీని ట్యాగ్ చేశాడు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube