ప్రముఖ ఛానెల్ లో ఆకట్టుకుంటున్న డ్యాన్స్ షో ఢీ ప్రస్తుతం 13వ సీజన్ జరుపుకుంటుంది.అదిరిపోయే డ్యాన్సర్స్ తో ఢీ 13 షో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.
ప్రతివారం క్రేజీ డ్యాన్స్ తో అలరిస్తున్న ఢీ షోలో వచ్చే వారం స్పెషల్ కాన్సెప్ట్ తో వస్తున్నారు.సూపర్ హిట్ సినిమాల కాన్సెప్ట్ తీసుకుని వాటితో డ్యాన్స్ కంపోజ్ చేసుకుని వస్తున్నారు.
లేటెస్ట్ గా ఆ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో రిలీజైంది. కేవలం కంటెస్టంట్స్ మాత్రమే కాదు జడ్జులుగా ఉన్న గణేష్, ప్రియమణి, పూర్ణలతో పాటుగా టీం లీడర్స్ గా ఉన్న సుధీర్, ఆది, రష్మి, దీపికలు కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాల్లోని పాత్రలతో కనిపించారు.
ఎపిసోడ్ ప్రోమోనే ఓ రేంజ్ లో ఉండగా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అదిరిపోతుందని మాత్రం చెప్పొచ్చు.సౌత్ డ్యాన్స్ షోల్లో ఢీని మించిన షో లేదు అన్న రేంజ్ లో డ్యాన్సర్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటున్నాయి.
కంటెస్టంట్స్ బయట వారైనా సరే ఢీ లో కొరియోగ్రాఫర్స్ మాత్రం తెలుగు వారే అవడం విశేషం.మొత్తానికి అలా కొరియోగ్రాఫర్స్ కు ఢీ ఒక చక్కని వేదికగా మారిందని చెప్పొచ్చు.
కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు ఎక్కడెక్కడినుండో వస్తున్న డ్యాన్సర్స్ కు ఢీ వారి టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.