కొద్దిరోజుల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ సేన్ లూంగ్ పునరుద్దరించిన గురుద్వారాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.దీనిపై ప్రశంసలు వర్షం కురిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.
ఆదివారం ‘‘మన్ కీ బాత్ ’’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.సింగపూర్ సిలాత్ రోడ్లో 1924లో నిర్మించిన గురుద్వారాను పునరుద్దరించి లీ సేన్ లూంగ్ మరోసారి ప్రారంభించారని ప్రధాని తెలిపారు.సింగపూర్ ప్రధాని తనకు మంచి మిత్రుడిని ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు.ఆ సమయంలో ఆయన సిక్కు మతస్తుడిలాగా తలపాగా కూడా ధరించారని ప్రధాని తెలిపారు.ఇలాంటి కార్యాక్రమాల వల్ల ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయని మోడీ పేర్కొన్నారు.సామరస్య పూర్వక వాతావరణంలో జీవించడం, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించడం ఎంత ముఖ్యమో ఇలాంటి కార్యక్రమాలు చూపిస్తాయని ప్రధాని వెల్లడించారు.
![Telugu Indianpm, Indians, Mann Ki Baat, Sikhs Community, Sikhs Singapore, Singap Telugu Indianpm, Indians, Mann Ki Baat, Sikhs Community, Sikhs Singapore, Singap](https://telugustop.com/wp-content/uploads/2021/07/PM-Modi-Praises-Singapore-PM-Mann-Ki-Baat.jpg)
ఇక భాయ్ మహారాజ్ సింగ్‌ను బ్రిటీష్ వారు 1850లో సింగపూర్‌కు రాజకీయ ఖైదీగా పంపారని.కానీ ఆయన ఒక ‘‘సెయింట్’’ లాగా అక్కడివారికి కనిపించారని ప్రధాని మోడీ తెలిపారు.భాయ్ మహారాజ్ సింగ్ సింగపూర్‌లో తొలి సిక్కు అని.ఆయన 1856లో ఔట్రామ్ జైలులో కన్నుమూశారని ప్రధాని పేర్కొన్నారు.సిలాత్ రోడ్‌లోని గురుద్వారా దాదాపు వందేళ్ల క్రితం నిర్మించారని.ఇక్కడ భాయ్ మహారాజ్ సింగ్ కోసం అంకితం చేసిన స్మారక చిహ్నం కూడా వుందని మోడీ వెల్లడించారు.
భాయ్ మహారాజ్ సింగ్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారని.త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.ఈ క్షణం మరింత స్పూర్తిదాయకంగా మారుతుందని మోడీ అన్నారు.
కాగా సిలాత్ రోడ్ గురుద్వారా భారత్‌లో కనిపించే గురుద్వారాల మాదిరిగానే నిర్మించారు.
ఇది సింగపూర్‌లో తొలి సిక్కు గురుద్వారా.సిక్కు పోలీసు అధికారుల సాయంతో దీనిని నిర్మించినందున పోలీస్ గురుద్వారాగా కూడా దీనిని పిలుస్తారు.
ఇది సింగపూర్‌లోని సిక్కులకు ఆధ్యాత్మిక స్వర్గధామంగా వుంది.సింగపూర్‌ను జపాన్ ఆక్రమించుకుంటున్న సమయంలో దేశాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలు ఆర్పించిన సిక్కుల భార్యలు, బిడ్డల సంరక్షణ బాధ్యతలను ఈ గురుద్వారా స్వీకరించింది.
![Telugu Indianpm, Indians, Mann Ki Baat, Sikhs Community, Sikhs Singapore, Singap Telugu Indianpm, Indians, Mann Ki Baat, Sikhs Community, Sikhs Singapore, Singap](https://telugustop.com/wp-content/uploads/2021/07/Indian-PM-Modi-Praises-Singapore-PM-Lee-Hsien-Loong-Mann-ki-Baat.jpg)
కాగా, సిక్కు సమాజం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు సింగపూర్ ప్రధానమంత్రి లీ సేన్ లూంగ్.జూలై మొదటివారంలో ఈ గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన తలపై తెల్లటి తలపాగా ధరించారు.సిక్కులు సాంప్రదాయబద్ధంగా చెప్పుకునే ‘‘సత్ శ్రీ అకాల్ ’’తో అందరినీ పలకరించారు.అప్పట్లో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.