నిక్కీ గల్రానీ. తెలుగు సినిమా పరిశ్రమలో సత్తా చాటుకున్న అందాల తార.
కన్నన బ్యూటీ సంజనా గల్రానీ చెల్లిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ క్యూట్ బ్యూటీ.సౌత్ సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలో ముందుకు దూసుకెళ్తుంది.
అద్భుత సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది.అక్క కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.
అంతే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది.తొలుత కన్నడ సినిమా పరిశ్రమలో సత్తా చాటిన ఈ అమ్మడు.
ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంది.
తమిళంలో ఆది పినిశెట్టితో కలిసి మలుపు, మరకతమణి సినిమాలు చేసి హిట్ కొట్టింది.ప్రస్తుతం ఆయనతోనే మరో సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.తనను ఓ వ్యక్తి చీట్ చేశాడని కంప్లైంట్ చేసింది.తనను మోసం చేసి రూ.50 లక్షలు దోచుకున్నాడని ఫిర్యాదు ఇచ్చింది.ఇంతకీ ఏం జరిగిందంటే.బెంగళూరులలోని కోరమంగళ ప్రాంతానికి చెందిన నిఖిల్.ఓ హోటల్ ను ప్రారంభించాడు.తనతో కలిసి బిజినెస్ చేయాలనుకుంది నిక్కీ.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది.అయితే తనకు నెలకు లక్ష చొప్పున ఇస్తానని చెప్పాడట నిఖిల్.
![Telugu Aadi Pinishetty, Fifty Rupees, Hotel, Nikhil, Nikki Galrani, Nikkigalrani Telugu Aadi Pinishetty, Fifty Rupees, Hotel, Nikhil, Nikki Galrani, Nikkigalrani](https://telugustop.com/wp-content/uploads/2021/07/unknown-facts-about-actresses-nikki-galrani.jpg )
అందుకు ఓకే చెప్పింది నిక్కీ.అయితే పెట్టుబడి పెట్టి చాలా కాలం అయ్యింది.కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు నిఖిల్.తాను మోస పోయినట్లు తెలుసుకున్న ఆమె.పోలీసులను ఆశ్రయించింది.తనను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు… తన సొమ్మును ఇప్పటించాలని కోరింది.
![Telugu Aadi Pinishetty, Fifty Rupees, Hotel, Nikhil, Nikki Galrani, Nikkigalrani Telugu Aadi Pinishetty, Fifty Rupees, Hotel, Nikhil, Nikki Galrani, Nikkigalrani](https://telugustop.com/wp-content/uploads/2021/07/unknown-facts-about-actress-nikki-galrani-aadi-pinishetty.jpg )
నిక్కీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు.అటు తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నిక్కీ.ఆది పినిశెట్టితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు.త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.