వ‌ర్షాకాలంలో ఈ టీ తాగితే..సీజ‌న‌ల్ వ్యాధులు బహుప‌రార్‌!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం.మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది.ఎందుకంటే.డెంగ్యూ, జ‌లుబు, ఫ్లూ, టైఫాయిడ్, చికెన్ గున్యా, క‌ల‌రా, డ‌యేరియా మొద‌ల‌గు వ్యాధులు ఈ సీజ‌న్‌లోనే అత్య‌ధికంగా ఉంటాయి.ఈ సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరంగా ఉండాలంటే.

 Best Tea For Avoiding Monsoon Diseases!, Best Tea, Avoiding Monsoon Diseases, Mo-TeluguStop.com

ఖ‌చ్చితంగా రోగ నిరోధ‌క వ్యవ‌స్థ‌ను బ‌ల‌ప‌రుచుకోవాల్సి ఉంటుంది.అయితే అందుకు జీలకర్ర, ధనియాలు మరియు సోంపుతో త‌యారు చేసిన టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఈ టీని ఎలా త‌యారు చేసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఈ టీ వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గిన్నె తీసుకుని అందులో ఒకటిన్న‌ర‌ గ్లాస్ వాట‌ర్ పోసి వేడి చేయాలి.

ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధ‌నియాలు, అర స్పూన్ జీల‌క‌ర్ర మ‌రియు అర స్పూన్ సోంపు వేసి బాగా మ‌రిగించి.వ‌డ‌బోసుకోవాలి.ఈ టీని డైరెక్ట్‌గానే తీసుకోవ‌చ్చు.లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు.

Telugu Tea, Coriander Seeds, Cumin, Cumincoriander, Fennel, Tips, Latest-Telugu

ఈ వ‌ర్షాకాలంలో ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ టీని సేవిస్తే. రోగ నిరోధ‌క శ‌క్తి అద్భుతంగా పెరుగుతుంది.దాంతో సీజ‌న‌ల్ వ్యాధులు బ‌హుప‌రార్ అవుతాయి.అలాగే జీలకర్ర, ధనియాలు మరియు సోంపుతో త‌యారు చేసిన ఈ టీ తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Telugu Tea, Coriander Seeds, Cumin, Cumincoriander, Fennel, Tips, Latest-Telugu

అంతేకాదు, రెగ్యుల‌ర్‌గా ఈ టీని తీసుకుంటే ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ ఈ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక ఈ టీని ఉద‌యాన్నే తాగితే.

శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొల‌గిపోతాయి.కాలేయం శుభ్ర ప‌డుతుంది.

అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube