సినిమాలకు, సిరీస్ లకూ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుసా?

ఇన్సూరెన్స్ అనేది జీవితానికి, వాహనాలకు మాత్రమే ఉంటాయన్న సంగతి తెలుసు.కానీ సినిమాలకు, సిరీస్ లకు కూడా ఇన్సూరెన్స్ ఉందని చాలా వరకు ఎవరికి తెలియదు.

 Do You Know That Movies And Web Series Are Having Insurance, Movies, Series, Ins-TeluguStop.com

కానీ ఇండస్ట్రీలో కూడా ఇన్సూరెన్స్ విధానం ఉంది.అందులో కూడా కొన్ని ప్యాకేజీలకు మాత్రమే ఇన్సూరెన్స్ అవకాశం కల్పించారు.

సినిమా షూటింగ్ ల మధ్య ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వంటివి ఎదురవడంతో వాటికి ఇన్సూరెన్స్ వంటివి కల్పించారు.

దీంతో చాలా మంది నిర్మాతలు కూడా ఇన్సూరెన్స్ లపై ఆసక్తి చూపుతున్నారు.

ఏ సినిమాకు తగ్గట్టుగా ఆ సినిమా కు ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఉంటుందట.నటీనటులు ఎంత పెద్ద వారిని, సెట్లో ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయని, లొకేషన్ లో షూటింగ్ ఏ విధంగా ఉందని పైగా సినిమాపై ఏమైనా వివాదాలు ఉన్నాయా వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ ను నిర్ణయిస్తున్నారట.

ప్రస్తుతం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా ముందున్నాయి.బడ్జెట్ విషయంలో కూడా వెబ్ సిరీస్ లు ముందున్నాయి.

Telugu Corona Wave, Insurance, India Assurance, Pandemic Cover-Movie

ఓరియంటల్ ఇన్సూరెన్స్ అంతే కాకుండా న్యూ ఇండియా అస్యురెన్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సినిమా భీమాను అందిస్తున్నాయి.సినిమా బడ్జెట్ పెరిగితే ఇన్సూరెన్స్ పెరుగుతుందట.చాలా వరకు సినిమాలకు ఇన్సూరెన్స్ 15 నుంచి 50 కోట్లు ఉండేదట.కానీ ప్రస్తుతం పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో పైగా ఓటీటీ సిరీస్ లు కూడా పెరుగుతున్న తరుణంలో వంద కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

Telugu Corona Wave, Insurance, India Assurance, Pandemic Cover-Movie

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెట్ లో ప్రీమియం ఆదాయం వంద కోట్లు ఉందని తెలపడంతో ఇన్సూరెన్స్ తీసుకునే సినిమాల సంఖ్య, వాటి ప్రీమియం రేట్ల పెరుగుదల ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్ త్వరలోనే రెట్టింపు అవుతుందని తెలిపారు.ఇక ఇప్పుడు 144 సెక్షన్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుందని కొందరు నిర్మాతలు తెలపడంతో ఇటువంటి వాటికి ఇన్సూరెన్స్ అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోలేదట.ఇదివరకు పాండమిక్ రిస్క్ కవర్ సినిమాలకు మాత్రమే ఉంది.ఇక ఇప్పుడు ఈ కవర్ ను ఇవ్వడం లేదని తెలుస్తోంది.కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోతే కవర్ లేదని తెలిపారు.

Telugu Corona Wave, Insurance, India Assurance, Pandemic Cover-Movie

మరో ప్రదేశం లో షూటింగ్ నిషేధించినట్లయితే కూడా ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండదని తెలిపారు.ఇక ఒక నటుడికి ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల లేదా అనారోగ్య సమస్యల వల్ల షూటింగ్ ఆగిపోతే ఇన్సూరెన్స్ పొందవచ్చని. కానీ అందులో కూడా కొన్ని షరతులు ఉన్నాయని తెలిపారు.

కానీ కోవిడ్ కారణంగా మాత్రం కవర్ లేదని కొన్నిసార్లు ఆర్టిస్ట్ సినిమా మధ్యలో వెళ్లి పోయే అవకాశం ఉందని కాబట్టి ఇటువంటి వాటికి ఇన్సూరెన్స్ సహాయం ఉండదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube