ధోని ఫే‌ర్‌వెల్ మ్యాచ్ ఆడకపోవడానికి అదే కారణమా..?

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను రిటైర్ అవుతున్నానని న్యూజీలాండ్ కీపర్ జేబీ వాట్లింగ్ వెల్లడించిన తర్వాత సదరు జట్టు అతనికి అద్భుతంగా వీడ్కోలు పలికింది.ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర తదితర క్రికెట్ ఆటగాళ్లు తాము ఫలానా మ్యాచ్ తర్వాత రిటైర్ కాబోతున్నామని ముందే ప్రకటించి తమ జట్టు నుంచి బ్రహ్మాండమైన వీడ్కోలు అందుకొని సగర్వంగా మైదానాన్ని విడిచిపెట్టారు.

 Is That The Reason Why Dhoni Did Not Play The Farewell Match Ms Dhoni, Sports,-TeluguStop.com

కానీ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని మాత్రం తన రిటైర్మెంట్ ని సడన్ గా ప్రకటించారు.దీంతో ఆయన చివరి మ్యాచ్ లో వీడ్కోలు చెప్పేందుకు జట్టుకి అవకాశం లేకుండా పోయింది.

ఎల్లకాలం గుర్తుండిపోయేలా వీడ్కోలు అందుకోకుండానే ఆయన అర్దాంతరంగా రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.గత సంవత్సరం ఐపీఎల్ ఈవెంట్ కి ముందు ధోని రిటైర్మెంట్‌ను ప్రకటించగా ఆయన సడన్ గా తీసుకున్న డెసిషన్ ఎవరికీ ఒకపట్టాన అంతుబట్టలేదు.

చాలా మంది అభిమానులు క్రికెట్‌ను అకస్మాత్తుగా ఎందుకు వదిలేసారు అంటూ ధోనికి ఎన్నో ప్రశ్నలు కూడా వేశారు.

Telugu Well, Msdhoni, Ups-Latest News - Telugu

అయితే వారందరి ప్రశ్నలకు మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్‌సింగ్ సమాధానమిచ్చారు.తాజాగా ఆయన మాట్లాడుతూ పోయిన సంవత్సరం ఆస్ట్రేలియా దేశంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచులు జరిగినట్లయితే వాటిలో ధోని ఆడి రిటైర్మెంట్‌ను ప్రకటించేవారు.సెలెక్టర్లు కూడా ధోనీని ఎంపిక చేశారు.

కానీ కరోనా మహమ్మారి వల్ల ఆ టోర్నీ క్యాన్సిల్ అయ్యింది.మరోపక్క భారతదేశంలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ అక్టోబర్-నవంబర్‌కు వాయిదా వేశారు.

ఐతే అన్ని రోజులు వరకు తన ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టమని ధోని భావించారు.అందుకే ఫే‌ర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే ధోని రిటైర్మెంట్ ప్రకటించారు ’ అని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube