వైరల్: వేటగాళ్ళ దెబ్బకి సముద్రతీర మొత్తం రక్తసిక్తం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

భూమి మీద మనిషి జీవించే కంటే ముందే జంతువులు జీవించయని సైన్స్ చెబుతోందన్న విషయం అందరికి తెలిసిందే.అయితే భూమి ఆవిర్భవించిన అనంతరం పుట్టిన చాలా జంతువులు మనము ఇప్పుడు చూడలేకపోతున్నాం.

 The Whole Beach Is Bleeding Due To The Poachers' Blow .. What Is The Real Matter-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో మనకు తెలిసిన ఎన్నో జంతువులు అంతమైపోతున్నాయి.అయితే మన పురాతన కాలంలో వన్యప్రాణులను వివిధ రకాల కారణాలతో వేటాడేవారు.

కొంతమంది బలప్రదర్శన, ధైర్యసాహసాలను నిరూపించుకునేందుకు జంతువులపై దాడికి పాల్పడే వారు.

ఇక తాజాగా ఫారో దీవులలోని వేటగాళ్లు చేసిన పనికి ఏకంగా 175 పైగా తిమింగలాలు మృత్యువాత పడ్డాయి.

ఈ దారుణమైన సంఘటన ఫ్రోస్లోని గ్రిన్‌ డ్రాప్‌ లేదా గ్రైండ్‌ పేరు గాంచిన దీపంలో జరిగింది.దాదాపు 20 పడవలో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌ సహాయంతో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సముద్ర తీరప్రాంతంలో 52 పైలెట్ తిమింగలాలు మృత్యువాత పడగా మరోచోట ఏకంగా 123 మృతి చెందాయి.దీంతో ఒక్కసారిగా సముద్రతీర మొత్తం రక్తస్రావం అయిపోయింది.అచ్చం ఇలాంటి సంఘటనే గత దశాబ్ది కాలంలో 6500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్ లు మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఈ సంఘటన ఎలా వెలుగులోకి వచ్చింది అన్న విషయానికి వెళ్తే సముద్రంలోకి సీ షెపర్డ్ పరిరక్షణకారులు డోను ప్రారంభించారు.అలా డ్రోన్ తిమింగలాలు ఉండే ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో అసలు నిజం బయటకు వచ్చింది.ఈ క్రమంలో ఒక ముష్కరుడు ఫోర్‌ మ్యాన్‌ ను వేటాడండి అంటూ డ్రోన్స్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం ఈ సంఘటనపై దీవులలో నివసించే వారు కొన్ని గ్రూపులుగా విడిపోయి చాలా మంది వారి సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియాను, ఎన్నారైలను కోరుకున్నారు.

అంతేకాకుండా చాలా మంది స్థానికులు అక్కడివారు తిమింగలం మాంసం కూడా సేవిస్తారని సమాచారం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube