కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీశ్‎కు ఢిల్లీ పోలీసుల నోటీసులు..!

హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan ) కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీశ్( manne Satish ) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 Delhi Police Notices To Congress Social Media In-charge Manne Satish, Manne Sati-TeluguStop.com

ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 91 కింద ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.అయితే ఫిర్యాదు ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు అడిగారని తెలుస్తోంది.

కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా ( Amit Shah ) పేరుతో ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేశారని కాంగ్రెస్ పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తుంది.విచారణలో భాగంగా కాంగ్రెస్ నేతలకు పోలీసులు నోటీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ది చెబుతామని కర్ణాటక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube