అలనాటి సహజనటి జయసుధ( Jayasudha ) గురించి తెలియని తెలుగు వారు ఇక్కడ దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదేమో.తన అందం, అభినయంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో ఆమె అగ్ర నటులు అయినటువంటి ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, సుధాకర్, చంద్రమోహన్ తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు.ఒక్క తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా మెప్పిస్తున్నారు.
అయితే గతంలో కంటే ఆమె ఇపుడు చాలా అరుదుగా సినిమాలు ఒప్పుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో కూడా ఆమె మీడియా వేడుకలలో చాలా తక్కువగా కనిపిస్తూ వుంటారు.అయినా ఆమెకి సంబందించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటుడు రైటర్ అయినటువంటి తోటపల్లి మధు ఓ ఇంటర్వ్యూ వేదికగా నటి జయసుధ గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.
విషయం ఏమిటంటే ఆమె ప్రతి రోజు దాదాపుగా 25 లీటర్ల పాలు( 25 liters of milk ) పోయించుకునేవారట.ఒక సందర్భంలో ఆ దృశ్యాన్ని చూసిన రైటర్ తోటపల్లి మధు( Writer Thotapalli Madhu ) అవాక్కయ్యారట.‘పాలు తాగడానికి కొంటున్నారా? అమ్మడానికి కొంటున్నారా?’ అని జయసుధని అడిగారట.దాంతో ఆమె నవ్వుతూ… తాగడానికే అని సమాధానం ఇచ్చారట.

అసలు విషయం ఏమిటంటే… ఆమె ఇంట్లో దాదాపు పది పదిహేను మంది జనాలు ఉండేవారట.అలా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆమె అన్ని పాలు పోయించుకొనేదట.ఇకపోతే నటి జయసుధ చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తూ ఉంటారు.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడం కూడా జరిగింది.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె కొంత మందినే సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పుకొచ్చింది.
మోహన్ బాబు, మురళీ మోహన్ ఆమెని చెల్లెమ్మ అని ముద్దుగా పిలుస్తారట.అందుకే ఆమె వాళ్లను అన్నయ్య అని పిలుస్తుందట.