సినిమా ఇండస్ట్రీ అంటేనే నిత్యం పార్టీలు వెకేషన్ లు అంటూ సెలబ్రిటీలు ఎంతో హడావిడి చేస్తూ ఉంటారు.ఈ విధంగా సెలబ్రిటీలందరూ కూడా తరచూ ఏదో ఒక పార్టీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే ఇలాంటి కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే( Bollywood Industry ) ఉందని చెప్పాలి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తరచూ ఇలాంటి ప్రవేట్ పార్టీలకు వెళ్తూ హంగామా చేస్తూ ఉంటారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ చాలా తక్కువగా ఉందని చెప్పాలి.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి నటుడు ఎన్టీఆర్( Ntr ) ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయనకు బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్( Hrithik Roshan ) నటిస్తున్నటువంటి వార్ 2( War 2 )సినిమాలో నటించబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తికాగా తాజాగా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది దీంతో ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు.
ఇలా ముంబై ( Mumbai ) వెళ్ళిన ప్రతిసారి ఈయన బాలీవుడ్ సెలబ్రిటీలు ఇస్తున్నటువంటి పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి తాజాగా మరోసారి ఎన్టీఆర్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇచ్చినటువంటి గ్రాండ్ పార్టీకి హాజరయ్యారు అయితే ఈసారి ఎన్టీఆర్ మాత్రమే కాకుండా తన భార్య ప్రణతితో కలిసి వెళ్లారు.
ఈ విధంగా ఎన్టీఆర్ తన భార్య ప్రణతి( Pranathi ) తో పాటు ముంబై వెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు వీరితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు ప్రస్తుతం ఇందుకున్సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారని తెలిపారు.అది కాకుండా ప్రణీతతో కలిసి వెళ్లడంతో ఇది కాస్త వైరల్ గా మారింది సాధారణంగా ప్రణీత ఇంటి నుంచి బయటకు రారు ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ లేదంటే తన భర్తతో కలిసి ఎక్కడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు మాత్రమే బయట కనిపిస్తూ ఉంటారు కానీ ఇలా తన భర్తతో కలిసి బాలీవుడ్ ప్రైవేట్ పార్టీకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.