సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై లో ఈ సినిమా చిత్రీకరణ కు సిద్దం అవుతున్నాయి.
జులై రెండవ వారంలో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లపై మొదట కీలక సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు.కాని కీర్తి సురేష్ డేట్ల విషయం లో కాస్త క్లాష్ రావడంతో ఆమె ఆగస్టు మొదటి వారంలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కీర్తి సురేష్ డేట్లు లేక పోవడంతో ఆమె తో కాకుండా మొదట యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాత ఆగస్టులో ఆమె తో మహేష్ బాబు కాంబో సన్నివేశాలను చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు ప్రారంభించినప్పటి నుండి కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

మహేష్ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ గా నిలిచింది.ఇక పరశురామ్ గత చిత్రం గీత గోవిందం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఈ సినిమా ఖచ్చితంగా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం పరశురామ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ కోసం సెట్టింగ్ లను వేయిస్తున్నారు.
ఏప్రిల్ లో ఈ సినిమా కోసం ఏర్పాట్లు చేశారు.కాని కరోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్ నిలిచి పోయింది.ఒకటి రెండు రోజులు షూటింగ్ కూడా ఆ సమయంలో చేసినట్లుగా సమాచారం అందుతోంది.పెద్ద మొత్తంలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు.
సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమా లు మరో రేంజ్ లో ఉంటాయనే నమ్మకంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.