సలార్‌ లో నటిస్తున్నారా ప్రశ్నకు కేజీఎఫ్‌ స్టార్‌ సమాధానం ఇదే

కేజీఎఫ్ రెండు పార్ట్‌ ల్లో హీరోయిన్‌ గా నటించిన శ్రీనిధి శెట్టికి సలార్‌ లో కూడా ఛాన్స్ దక్కిందనే వార్తలపై స్పష్టత వచ్చేసింది.గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది.

 Shrinidhi Shetty Clarity On Salaar News , #salaar, Director Prashanth Neel, Flim-TeluguStop.com

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే శ్రీనిధి శెట్టి ఆరంభంలోనే ఈ పుకార్లకు చెక్‌ పెట్టేసింది.సలార్‌ సినిమా పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కనుక ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.పెద్ద ఎత్తున వస్తున్న ఆ వార్తలకు సమాధానం లభించడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు గాను శ్రీనిధి శెట్టి స్పందిస్తూ తాను సలార్‌ సినిమా లో భాగం కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది.అయితే ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా మాత్రం స్పష్టత ఇచ్చింది.

Telugu Salaar, Prashanth Neel, Kgf, Srinidhi Shetty-Movie

సౌత్ లో శ్రీనిధి శెట్టి కి కేజీఎఫ్ తో విపరీతమైన క్రేజ్ దక్కింది.సినిమా లో ఆమె కనిపించింది కొన్ని నిమిషాలే అయినా కూడా ఆమెకు ఆఫర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమా లు ఉన్నాయి.కేజీఎఫ్ 2 సినిమా విడుదల తర్వాత మరిన్ని సినిమా లు ఆమెకు వస్తాయని అంటున్నారు.కేజీఎఫ్ లో శ్రీనిధి శెట్టితో వర్క్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ సలార్ సినిమాలో కూడా ఆమె తో వర్క్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐటెం సాంగ్‌ లేదా కీలక పాత్రలో ఆమెను నటింపజేస్తాడు అనే వార్తలు వచ్చాయిన నేపథ్యంలో ఆమె స్పష్టత ఇవ్వడం జరిగింది.

మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలియజేసింది.సలార్‌ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా ముద్దు గుమ్మ శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube