ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీ.ఎం జగన్ ప్రసంగం ఆసక్తికరంగా మారింది.
తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని వైఎస్ జగన్ ప్రసంగం ప్రారంభించారు.కొవిడ్ బాధితులకు నివాళిగా కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరారు.
ఇక ప్రసంగంలో భాగంగా ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్ష్యా.మహానేత వై.
ఎస్.ఆర్ చనిపోయిన టైం లో ఎన్నో కుటుంబాలు పడుతున్న ఇబ్బందిని తెలుసుకుని వారి కోసం ఏ పొలిటీషియన్ చేయని విధంగా ఓదార్పు యాత్ర చేశానని చెప్పారు.ఆ టైం లో వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ప్రతి ఒక్కరిని కలిశానని అన్నారు.ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్య శ్రీని పూర్తి మార్చేశామని అన్నారు.
ఆరోగ్య శ్రీని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా చేశామంబి.ఆరోగ్య శ్రీ ప్రాణం పోసే పథకం అవ్వాలని కోరుకున్నామని అన్నారు.
అంతేకాదు 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చేశామని.తాము అధికారంలోకి రాకముందు ఆరోగ్య శ్రీ లో 1000 చికిత్సలకే అనుమతి ఉంది.మేము వచ్చాక 2400 రోగాలకు ఆరోగ్య శ్రీ విస్తరించామని అన్నారు.1180 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేశామని ప్రతి మండలానికి అవి అందుబాటులో ఉన్నాయని అన్నారు.వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టామని అన్నారు వైఎస్ జగన్. వై.ఎస్.ఆర్ విలేజ్ క్లినిక్ లను తీసుకున్వస్తున్నామని.90 రకాల జబ్బులకు అక్కడే ఔషధాలు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.