తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి పన్ను.ఈ అమ్మడు తెలుగులో గ్లామర్ బ్యూటీగా వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశం సొంతం చేసుకుంది.
అయితే తెలుగులో ఆమె ఎక్కువగా కమర్శియల్ సినిమాలు చేసిన హీరోలతో పాటలకే పరిమితం అయ్యే పాత్రలే చేసింది. సాహసం, మొగుడు, మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి సినిమాలో కాస్తా ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలలో నటించిన ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం సంతృప్తి ఇవ్వలేదు.
దీంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ ఫిమేల్ సెంట్రిక్ కథలతో వరుస సినిమాలని సైన్ చేసి హిట్స్ సొంతం చేసుకుంది.దీంతో మినిమమ్ బడ్జెట్ ఫిమేల్ సెంట్రిక్ కథలతో బిటౌన్ లో తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
ఆమె నటించిన తప్పడ్ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో రష్మీ రాకెట్, హసీనా దిల్ రూబా, లూప్ లుపేటా, దొబారా సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్ లో బిజీగా ఉంది.ఇలా వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న తాప్సికి మాత్రం తెలుగులో తన మార్క్ సినిమాలు చేయాలనే కసితో ఉంది.
తనకు ఈ ఫేం రావడానికి తెలుగు సినిమాకే కారణం కాబట్టి ఇక్కడ తన ఐడెంటిటీ చూపించుకోవాలని ఉత్శుకత చూపిస్తుంది.ఈ నేపధ్యంలో కొత్త దర్శకుల కథలు వింటున్నట్లు బోగట్టా.
రీసెంట్ గా ఓ ఫిమేల్ సెంట్రిక్ క్రైమ్ స్టొరీకి ఈ భామ ఒకే చెప్పిందని, అందులో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
.