టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందనే సంగతి తెలిసిందే.నంబర్ వన్ హీరో, హీరోయిన్ అనిపించుకోవడానికి హీరోహీరోయిన్లు ఎంతగానో శ్రమిస్తారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లు జయప్రద, శ్రీదేవి మధ్య గొడవలు ఉన్నాయని వాళ్లిద్దరూ హీరోయిన్లుగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఒక సందర్భంలో జయప్రద శ్రీదేవితో ఉన్న గొడవల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.
ఇండియన్ ఐడల్ 12కు అతిథిగా హాజరైన జయప్రద శ్రీదేవి, తాను డైరెక్ట్ గా ఎప్పుడూ గొడవ పడలేదని అన్నారు.అయితే తనకు, శ్రీదేవికి మధ్య కెమిస్ట్రీ మాత్రం మ్యాచ్ కాలేదని ఆమె వెల్లడించారు.
మా ఇద్దరికి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉందేది కాదంటూ జయప్రద తెలిపారు.ఇద్దరి మధ్య పోటీ ఉండేదని ఎవరూ తగ్గేవాళ్లం కాదని ఆమె పేర్కొన్నారు.ఒకరిపై మరొకరం పై చేయి సాధించాలని అనుకునే వాళ్లమని ఆమె తెలిపారు.
కొన్ని సినిమాల్లో తాను, శ్రీదేవి అక్కాచెల్లెళ్లుగా కనిపించగా రియల్ లైఫ్ లో మాత్రం ఒకరితో మరొకరికి కనీసం పరిచయం కూడా లేదనే విధంగా వ్యవహరించే వాళ్లమని ఆమె చెప్పారు.
డైరెక్టర్లు, నటులు ఎవరైనా పరిచయం చేస్తే మాత్రం హలో అని పలకరించుకునే వాళ్లమంటూ కీలక విషయాన్ని ఆమె వెల్లడించారు.శ్రీదేవిని, తనను కలపడానికి చాలామంది ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని జయప్రద తెలిపారు.
![Telugu Locked, War, Jayaprada, Sridevi-Movie Telugu Locked, War, Jayaprada, Sridevi-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/04/being-locked-cold-war-jayaprada-room-together-sridevi.jpg )
నన్ను, శ్రీదేవిని ఒకసారి జితేంద్ర, రాజేష్ కుమార్ గదిలో పెట్టి లాక్ చేశారని దాదాపు గంట సమయం లాక్ చేసినా తాము మాట్లాడుకోలేదని ఆమె తెలిపారు.గంట తర్వాత తలుపు తీసి చూస్తే ఒకరి పక్కన మరొకరం కూర్చుని ఉన్నామని శ్రీదేవితో ఉన్న కోల్డ్ వార్ కు సంబంధించి జయప్రద వివరణ ఇచ్చారు.