పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన, దానిని దర్శకుడు వేణు శ్రీరామ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టైల్ కి తగ్గట్లు మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ ని అభిమానులు తెరపై ఎలా చూడటానికి ఇష్టపడతారో అలాంటి క్యారెక్టరైజేషన్ తో సినిమాని ప్రెజెంట్ చేసిన విధంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.ముఖ్యంగా మహిళలకి, మెగా, పవర్ స్టార్ అభిమానులు అయితే సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా వకీల్ సాబ్ సినిమా చూడటం కోసం థియేటర్స్ కి వెళ్తున్నారు.ఇదిలా ఉంటే మొదటి వారంలోనే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా అనేసరికి సామాన్య ప్రేక్షకులే తెరపై అతనిని చూడకుండా ఉండలేకపోతున్నారు.అలాంటిది సినిమాలో నటించిన వారు ఎలా ఉంటారు.
ఇందులో కీలక పాత్రలో నటించిన నివేదా థామస్ కూడా వకీల్ సాబ్ సినిమాని థియేటర్ లో చూడాలనే అత్యుత్సాహంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులకి అడ్డంగా బుక్ అయ్యింది.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ విషయంలో రాజకీయం చేస్తున్న ఒక వర్గం వాళ్ళు ఇప్పుడు నివేదా థామస్ థియేటర్ లో సినిమా చూడటంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
దీనికి కారణం కూడా ఉంది.కొద్ది రోజుల క్రితం నివేదా థామస్ కరోనా బారిన పడింది.దీంతో ఆమె ప్రమోషన్ కి కూడా పూర్తిస్థాయిలో రాలేక హోం క్వారంటైన్ కి పరిమితం అయ్యింది.అయితే కరోనా వచ్చిన తర్వాత తగ్గినా కూడా రెండు వారల పాటు కచ్చితంగా హోం క్వారంటైన్ లో ఉండాలి.
అయితే నివేదా థామస్ వారం రోజుల్లోనే కనీసం కరోనా తగ్గిందనే విషయాన్ని కూడా చెప్పకుండా జనాల మధ్యలో థియేటర్ కి వచ్చి సినిమా చూడటం ఇప్పుడు వివాదంగా మారింది.ఆమె థియేటర్ లో సినిమా చూసిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించింది.
దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.కరోనాతో ఎలా బయటకి వచ్చి సినిమా చూస్తావ్ అంటూ ఆమె మీద విమర్శలు చేస్తున్నారు.