అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.అందుకే ఈ సినిమా కోసం ప్రముఖ నటీ నటులను ఎంపిక చేయడం జరిగింది.
ఇక ఈ సినిమా టెక్నిషియన్స్ విషయానికి వస్తే అత్యున్నత శ్రేణి వారిని ఎంపిక చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తాజాగా ఈ సినిమా సౌండ్ రికార్డింగ్ కోసం ఏకంగా ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన రసూల్ పూకుట్టిని ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
తమిళంతో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు సౌండ్ డిజైనర్ గా వర్క్ చేసిన రసూల్ ఎంట్రీతో పుష్ప సినిమా రేంజ్ మరింతగా పెరిగింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
నేడు సాయంత్రం టీజర్ రాబోతుంది.
ఆ టీజర్ కోసం రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేశాడట.సినిమా టీజర్ కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.
అల్లు అర్జున్ నేడు విడుదల కాబోతున్న టీజర్ కు లైక్స్ విషయంలో సరికొత్త రికార్డును కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.రసూల్ పూకుట్టి సౌండ్ తో టీజర్ మరో రేంజ్ లో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు.
సరికొత్త సౌండ్ ను తెలుగు ప్రేక్షకులకు రసూల్ పరిచయం చేస్తాడేమో చూడాలి.స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా కు గాను ఆయన ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే.
ఆ తర్వా కూడా ఆయన ఎన్నో సినిమా లకు అవార్డు లు రివార్డు లు అందుకున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ మరియు రసూల్ కలిసి పుష్ప సౌండ్ ను మరో రేంజ్ కు తీసుకు వెళ్తారేమో చూడాలి.