అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న నటుడు అల్లు శిరీష్.అయితే ఇప్పటి వరకు కెరియర్ లో శాలిడ్ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.
అల్లు శిరీష్ చివరిగా ఏబీసీడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కోసం శిరీష్ భాగా గ్యాప్ తీసుకున్నాడు.కాని ఈ లోపు హిందీలో ఓ ఆల్బమ్ సాంగ్ చేశాడు.
ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.సౌత్ ఇండియన్ హీరో హిందీలో చేసిన మొదటి ఆల్బమ్ ఇదే అని చెప్పాలి.
విలయాతి శరాబ్ అనే ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో నటి హీలీ దారూవాలాతో కలిసి ఆటో డ్రైవర్ గెటప్ లో శిరీష్ స్టెప్పులేశాడు.ఆదిల్ షేక్ కొరియోగ్రఫీ చేయడంతో పాటు డైరెక్షన్ చేసిన ఈ పాటకు లిజో జార్జ్, డిజె చేటాస్ కలిసి ట్యూన్ కంపోజ్ చేశారు.
దర్శన్ రావల్, నీతి మోహన్ కలిసి ఆలపించారు.ప్రస్తుతం ఈ పాట బాలీవుడ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
సాంగ్ యూట్యూబ్ లో విడుదలైన వారం రోజుల్లోనే 92 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి 100 మిలియన్స్ వైపు పరుగులు పెడుతోంది.ఈ సాంగ్ కంటే ముందుగా సౌత్ ఇండియన్ బ్యూటీస్ అయిన రష్మిక మందన, హాన్సికా మొత్వానీ హిందీ ఆల్బమ్ సాంగ్స్ లో సందడి చేశారు.అయితే వారి పాటలకి వచ్చిన గుర్తింపు అల్లు శిరీష్ ఆల్బమ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇదే క్రేజ్ తో అల్లు శిరీష్ హిందీ సినిమాలలో కూడా ఎంట్రీ ఇస్తాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.