మీ పిలల్లకు ఐదు సంవత్సరాలు నిండితే ఆధార్ అప్డేట్ చేసారా మరి.. !!

ఈ కాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం.ఆధార్ లేనిదే ఏ పని కూడా అవ్వని రోజులివి.

 If Your Child Is Five Years Old Have You Updated Your Aadhaar Aadhar Card, 5 Ye-TeluguStop.com

మరి అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు ఎలా అనే డౌట్ మీకు రావచ్చు.అయితే ఇప్పుడు నవజాత శిశువుకు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా !? కానీ దీనిని మీరు రెండుసార్లు అప్‌డేట్ చేయవలిసి ఉంటుంది.మీరు మీ పిల్లల ఆధార్ కార్డు తీసుకుంటే 5, 15 సంవత్సరాల వయస్సులో దాన్ని అప్‌డేట్‌ చేయడం మాత్రం మరిచిపోవద్దు.లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది ఎలా ఉంటుందో అనే విషయం ఒకసారి చూద్దాం.పిల్లల ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది.

బ్లూ కలర్ ఆధార్ కార్డును బాల ఆధార్ కార్డ్ అని కూడా అంటారు.బాల ఆధార్ కార్డుకు పిల్లల తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు సంఖ్య లింక్ చేయబడుతుంది.

ఎందుకంటే పిల్లల వేలు ముద్రలు పడవు కాబట్టి తల్లి తండ్రుల ఆధార్ లింక్ చేయవలిసి ఉంటుంది.

ఇందులో తల్లిదండ్రుల మొబైల్ నంబర్ కూడా నమోదు చేస్తారు.

పిల్లల ఆధార్ కార్డు తయారీకి, పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి మొబైల్ నంబర్ అవసరం.యుఐడిఎఐ వెబ్‌సైట్‌ లో ఇచ్చిన సమాచారం ప్రకారం.

మీరు మీ దగ్గర లోని పోస్టాఫీసు, బ్యాంక్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దీని కోసం, మీరు ఒక అప్లికేషన్ పూర్తి చేయవలిసి ఉంటుంది.

దీంతో పాటు తల్లిదండ్రుల ఆధార్ సంఖ్య కూడా నమోదు చేయాలి.తరువాత పిల్లల బయోమెట్రిక్ రికార్డ్ అనగా చేతి యొక్క 10 వేలిముద్రలు, కళ్ళు స్కాన్ చేస్తారు.

ఆధార్ నమోదు అయిన 90 రోజుల్లోపు ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది.UIDAI ప్రకారం, మీ పిల్లల 5, 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం తప్పనిసరి.

Telugu Aadhar, Latest-Latest News - Telugu

5 సంవత్సరాల ముందు ఆధార్ కార్డు తయారు చేసిన పిల్లలకు వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోబడవు.అందుకే 5 సంవత్సరాలలో నవీకరించడం అవసరం.అదే విధంగా పిల్లవాడు కౌమారదశలోకి ప్రవేశించినప్పుడు అతడి బయోమెట్రిక్ కోసం 15 సంవత్సరాల వయస్సులో బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం అవసరం.పిల్లల బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం కోసం రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు.

తల్లిదండ్రులు తమ సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వారి పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను నవీకరించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube