వరుసగా ఐదోసారి టెస్టు ఛాంపియన్‌షిప్ గద నిలబెట్టుకున్న టీమిండియా..!

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా దేశం లో పర్యటించి ఆసీస్ జట్టుతో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడి 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది.గత 30 ఏళ్లుగా టీమిండియా గెలవలేక పోతున్న గబ్బ స్టేడియంలో మన యువ క్రికెటర్లు అద్భుతమైన పోరాట ప్రతిభను కనబరిచి ఆస్ట్రేలియా ని చిత్తు చిత్తుగా ఓడించారు.

 Indian Cricket Team To Receive World Test Championship Trophy Fifth Time In A Se-TeluguStop.com

దీనితో టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది.ఇండియా చేతిలో పరాజయం పొందిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పట్టికలో మూడవ స్థానానికి పడిపోయింది.

ఆస్ట్రేలియాతో వన్డే టెస్ట్ ఆడిన తర్వాత భారత జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో హోరాహోరీగా తలపడింది.వరల్డ్ క్లాస్ టాప్ ప్లేయర్స్ పై గెలుపు సాధించడం దాదాపు అసాధ్యం అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు తమ అద్భుతమైన టాలెంట్ తో 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకున్నారు.

దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పట్టికలో టీమ్ ఇండియా జట్టు మొదటి స్థానానికి ఎగబాకింది.

Telugu Australia, England, Times, Indian Cricket, Championship, Latest-Latest Ne

దీంతో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన టీమ్ ఇండియా అతి త్వరలోనే టెస్టు చాంపియన్షిప్ గధ ను సేకరించనున్నది.ఏప్రిల్ 1వ తారీఖున అనగా రేపు క్రికెట్ ఇయర్ ముగియనున్నది.ఈ సందర్భంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమ్ ఇండియా జట్టుకి ఐసీసీ.

గధ ను సమర్పించనున్నది.ఐతే రేపు టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఈ ఛాంపియన్షిప్ గధ ను సేకరించనున్నారు.

అయితే విరాట్ కోహ్లీ చాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవడం ఐదవసారి కావడం విశేషం.మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీని బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియాని ఐదుసార్లు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.

నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీని పగ్గాలు తీసుకున్నప్పుడు ఐసిసి టెస్టు చాంపియన్షిప్ పట్టికలో భారత దేశం ఏడవ స్థానంలో ఉంది.కానీ తన అద్భుతమైన కెప్టెన్సీ తో విరాట్ కోహ్లీ వరుసగా టెస్ట్ మ్యాచు లలో గెలుస్తూ భారత జట్టుని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube