వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత నమ్మిన బంటుగా ఉండేవారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.వైఎస్ దయతో జమ్మలమడుగు సీటు దక్కించుకుని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచారు.
చంద్రబాబు ఆపరేన్ ఆకర్ష్ దెబ్బతో సైకిల్ ఎక్కేసి మంత్రి పదవి దక్కించుకున్నారు.ఆ తర్వాత చంద్రబాబు సైతం జగన్‌ను తిట్టేందుకు ఆదినారాయణ రెడ్డిని బాగా వాడుకునే వారు.
ఇక గత ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆదినారాయణ ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కూడా ఆయన జగన్‌ను కొద్ది రోజుల పాటు విపరీతంగా తిట్టినా.తర్వాత సైలెంట్ అయిపోయారు.ఇందుకు కారణం ఏంటా ? అని ఆరా తీస్తే జమ్మలమడుగు జనాలే రకరకాలుగా చెప్పుకుంటున్నారు.టీడీపీ ప్రభుత్వంలో ఆది మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు, ఆయన కుటుంబానికి కోట్లాది రూపాయల కాంట్రాక్టు పనులు ముట్టాయి.ఆ ప్రభుత్వంలో ఆయనకు దాదాపుగా రు.25 కోట్ల బిల్స్ ఆగిపోయాయట.తర్వాత ప్రభుత్వం మారిపోవడం.
ఆయన బిల్లులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగిపోయాయి.
అయితే ఆయన బిల్లులు ఇటీవల క్లియర్ అయిపోయాయట.వైసీపీకే చెందిన ఓ కీలక నేత చక్రం తిప్పడంతో పాటు ఆది ఆయనతో ఓ డీల్ సెటిల్ చేసుకుని మరీ తన బిల్లులు రాబట్టుకున్నారట.తనకు రావాల్సిన బిల్లుల్లో 30 శాతం కమీషన్ కింద ఆ వైసీపీ పెద్దాయనకు ముట్టడంతో ఆది బిల్లులు క్లీయర్ అయ్యేలా చేశారని తెలుస్తోంది.ఇది తెలిసిన వైసీపీ వాళ్లు లబోదిబో మంటున్నారు.
తాము పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని… పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని.కానీ వైసీపీ వాళ్లను ఇబ్బంది పెట్టిన ఆదినారాయణ రెడ్డి బిల్లులు ఆగడం లేదని వారు వాపోతున్నారట.
ప్రస్తుతం ఈ విషయం జమ్మలమడుగులో హాట్ టాపిక్‌గా మారింది.