ఏపీ కేబినెట్ మీటింగ్ సీఎం జగన్ అధ్యక్షతన వాడి వేడి గా జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా తన మంత్రి మండలి సభ్యులకు సీఎం గట్టిగా క్లాస్ పీకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మీకు కేటాయించిన శాఖలలో తప్ప ఇతర విషయాలలో అనవసరపు జోక్యం చేసుకుని తగాదాలు పడవద్దని మంత్రులకు సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి వ్యవహారాలు జోలికి పోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పార్టీకి పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలని చెప్పారట.ఈ నాలుగు నెలల కాలంలో మంత్రులంతా తమ శక్తి మేర బాగా పని చేశారని ఒకరిపై ఆరోపణలు వచ్చినా మొత్తంగా అంతా బాగానే ఉందని జగన్ మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే ఇకపై ప్రభుత్వం ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని అని ఇదే సమయంలో టిడిపి తరఫున పని చేస్తున్న కొన్ని మీడియా సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎల్లో మీడియా వైసిపి తప్పులను భూతద్దంలో పెట్టి చూసుకోవడమే పనిగా పెట్టుకుందని చిన్న తప్పిదం జరిగినా అది పెద్దదిగా చేసి ప్రజల ముందు వైసిపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోందని దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టబోతున్నామని జగన్ ప్రకటించారు.

చిన్న చిన్న తప్పులను కూడా పెద్దదిగా చేసి చూపించడం తనకు బాధగా ఉందని ఆ విషయంలో మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని జగన్ కోరారు.ఈ సందర్భంగా ఏపీలో ఇసుక కొరతపై చర్చ జరగగా ఇప్పటివరకు ఇసుక దోపిడీ కి అలవాటు పడిన టిడిపి వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ పట్టించుకోవద్దని జగన్ సూచించారు.ఇసుక దోపిడిని అరికట్టడం ద్వారా భారీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తెచ్చామని కానీ అనుకోకుండా అదే సమయంలో వార్తలు రావడంతో ఇసుక కొరత ఏర్పడిందని ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పాలని జగన్ సూచించారు.