Rahul Gandhi, TRS: ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేదని, కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌తో ఎలాంటి సంబందం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తెలంగాణ ప్రజల ప్రాణాలపై మేడలు కట్టి.

ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న పార్టీతో ఎలాంటి సంబంధం పెట్టుకునే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.కాంగ్రెస్ కేవలం ప్రజల వైపే ఉంటుందని, అవినీతి పార్టీల సపోర్ట్ అవసరం లేదని తేల్చి చెప్పింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.జాతీయ పార్టే ఎందుకు? గ్లోబల్ పార్టీగా ఎదగని.సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ పార్టీపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.

Advertisement

’సీఎం కేసీఆర్‌కు జాతీయ పార్టీని నడిపించాలని ఉంటే అతని ఇష్టం.జాతీయ పార్టే ఎందుకు? గ్లోబల్ పార్టీగా కూడా పోటీ చేయనివ్వండి.అది అతని ఇష్టం.

అమెరికా, చైనా, రష్యా ఇలా తదితర దేశాల్లో సీఎం కేసీఆర్‌ పోటీ చేయాలనుకునే భావన తనలో ఉంటే సంతోషమే.దానికి కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరం తెలపదు.

జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా కేసీఆర్ వెంట నడిచినా నో ప్రాబ్లమ్.’ అని పేర్కొన్నారు.

టీఆర్ఎస్-బీజేపీది ఒకటే ఎజెండా.టీఆర్ఎస్, బీజేపీది ఒకటే ఎజెండా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఇరు పార్టీలు పైకి సంబంధం లేనట్లు గొడవలు పడినా.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇద్దరూ ఒకటేనని అన్నారు.గతంలో టీఆర్ఎస్ బీజేపీతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉందన్నారు.

Advertisement

పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్న విషయాన్ని మర్చిపోవద్దని రాహుల్ గాంధీ వెల్లడించారు.ఈ రెండు పార్టీలు అప్రజాస్వామికమైనవని, వ్యాపార సంస్థలుగా పని చేస్తూ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

కేంద్రంలో ప్రధాని మోడీ పక్కా ప్రణాళికతో రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తుంటే.ఇక్కడ తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడని పేర్కొన్నారు.

తాజా వార్తలు