స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన జంషెడ్ జె.ఇరానీ (86) కన్నుమూశారు.ఝార్ఖండ్ జంషెడ్రుర్ లోని టాటా ఆస్పత్రిలో నిన్న రాత్రి 10 గంటలకు మరణించారని టాటా స్టీల్ ప్రకటించింది.1936లో జన్మించిన ఇరానీ, 1968లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చేరారు.టాటా మోటార్స్, టాటా టెలీ సర్వీసెస్ కంపెనీలకూ డైరెక్టర్గా పనిచేశారు.పరిశ్రమల రంగానికి చేసిన సేవలకు గాను ఇరానీకి 2007లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది.