Google Chrome : క్రోమ్ యూజర్స్‌కి షాక్.. అప్‌డేట్ చేయకుంటే అంతే సంగతులు

కంప్యూటర్ యూజర్లకు హాని కలిగించే ప్రమాదకరమైన సాంకేతిక లోపం గురించి గూగుల్ క్రోమ్ యూజర్లకు తాజాగా హెచ్చరికను జారీ చేసింది.అయితే ఆ సాంకేతిక లోపం ఏంటనేది గూగుల్ వెల్లడించలేదు.

 Shock For Chrome Users If Not Updated, That All ,google Chrome, Bugs, Risky Bu-TeluguStop.com

ఎందుకంటే ఆ లోపం ఏంటో తెలియజేస్తే హ్యాకర్లు వెంటనే చాలామంది డివైజ్‌లను చాలా ఈజీగా హ్యాక్ చేసే ప్రమాదం లేకపోలేదు.లేటెస్ట్ గూగుల్ క్రోమ్ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసేంతవరకు క్రోమ్ యూజర్లు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే.

ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్‌లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అక్టోబర్ 25న ఈ హై CVE-2022-3723 సాంకేతిక లోపాన్ని కనుగొన్నారు.

గూగుల్ క్రోమ్‌లోని ఈ టెక్నికల్ ఎర్రర్‌ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు, మ్యాక్, లైనక్స్ యూజర్లు తమ బ్రౌజర్లను లేటెస్ట్ వెర్షన్ 107.0.5304.87కి అప్‌డేట్ చేసుకోవాలి.విండోస్ యూజర్లు 107.0.5304.87/.88కి అప్‌డేట్ చేసుకోవాలి.ఈ అప్‌డేట్ సమస్యలను పరిష్కరిస్తుంది. బ్రౌజర్‌లో సెక్యూరిటీని మెరుగుపరుస్తుంది.కాబట్టి, మీరు మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం చాలా మంచిది.

Telugu Bugs, Chrome, Google Chrome, Risky Bugs, Tech-Latest News - Telugu

దీన్ని ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకుంటే.యూజర్లు ముందుగా తమ సిస్టమ్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. వెబ్ స్క్రీన్ టాప్ రైట్‌ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై నొక్కాలి.ఆపై సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి.తర్వాత’అబౌట్ క్రోమ్’పై క్లిక్ చేయాలి.అనంతరం లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేస్తే సరిపోతుంది.మీరు ఇంకా అప్‌డేట్‌ని అందుకోకుంటే, మ్యాక్, లైనక్స్ 107.0.5304.87.విండోస్ కోసం 107.0.5304.87/.88 అనే అప్‌డేట్‌ కోసం తరచూ చెక్ చేస్తూ ఉండాలని గూగుల్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube