పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాల్లో నటించే విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కథ నచ్చితే రీమేక్ సినిమాలలో కూడా నటించడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతుండటం గమనార్హం.పవన్ సాగర్ చంద్ర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా అయ్యాప్పనుమ్ కోషియమ్ సెట్స్ లోని పవన్ దిగిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.పవన్ కళ్యాణ్ తన చేతికి జాని అనే పేరుతో ఉన్న కర్చీఫ్ ను కట్టుకోవడం వల్ల అభిమానులు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కి 2003 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన విడుదలైన జానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కు కారణమయ్యాయి.

పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఆశించిన అంశాలు సినిమాలో లేకపోవడం ఆ సినిమాకు మైనస్ గా మారింది.సినిమాలో పవన్ కళ్యాణ్ జానీ అనే పేరుతో ఉన్న కర్చీఫ్ ను తలకు కట్టుకోగా చాలామంది ఫ్యాన్స్ కూడా పవన్ ను ఆ విషయంలో ఫాలో అయ్యారు.అయితే ఆ సినిమా పేరుతో ఉన్న కర్చీఫ్ తో పవన్ కనిపించడంతో పవన్ కర్చీఫ్ రూపంలో జానీ సినిమా చేదు జ్ఞాపకాన్ని ఇప్పటికీ దాచుకున్నారని అర్థమవుతోంది.