జేసీ వర్సెస్ కేతినేని ? దాడులతో తాడిపత్రిలో ఉద్రిక్తత ?

చాలా కాలంగా ప్రశాంతంగా ఉంటున్న అనంతపురం జిల్లా తాడిపత్రి లో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనట్లుగా కనిపిస్తున్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా జేసీ బ్రదర్స్ ప్రభాకర్ రెడ్డి , దివాకర్ రెడ్డి నష్ట పోయారు.

 Tadipathri Mla Kethireddy Peddareddy Vs Jc War Start, Jc Prabhakar Reddy, Jc Diw-TeluguStop.com

అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.రాజకీయంగాను కోలుకోలేని ఎదురు దెబ్బలు తిన్నారు.

ఇదిలా ఉండగా మరోసారి వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది.తాజాగా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, జేసీ నివాసానికి వెళ్లి ఆదోళనకు దిగారు.

దీంతో జేసి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.

ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పాటు, నిరసన కార్యక్రమాలకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.లాఠీఛార్జ్ చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మరోవైపు స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని జెసి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే తమ ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ananthapuram, Divaka, Jc Brothers, Kethi Pedda, Prabhaka, War, Tadipathri

ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడిలో ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కిరణ్ అనే వ్యక్తి గాయాల పాలైనట్లు చెబుతున్నారు.దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య కు వ్యతిరేకంగా జేసి వర్గీయులు పోస్టులు పెట్టడంతోనే పెద్దారెడ్డి, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

కాకపోతే ఈ దాడుల సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు స్థానికంగా అందుబాటులో లేరు.హైదరాబాదులో ఉన్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి బయలుదేరినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారం మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube