భారత క్రికెట్ జట్టులో ఓపెనింగ్ అయినా, మిడిలార్డర్ అయినా, లేదా కీపింగ్ అయినా ఇలా ఏదైనా సరే తనదైన ఆట తీరుతో ఆకట్టుకునే భారత క్రికెటర్ కె.ఎల్ రాహుల్ గురించి తెలియనివారుండరు.
అయితే తే.గీ నిన్నమొన్నటి వరకు కరోనా వైరస్ లాక్ డౌన్ విధించడంతో ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నాడు.
అయితే తాజాగా కేఎల్ రాహుల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను సైకిల్ తొక్కుతున్న సమయంలో వెనకనుంచి తీసినటువంటి ఓ ఫోటోని షేర్ షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలో కె.ఎల్.రాహుల్ గ్రీన్ క్యాప్ పెట్టుకొని బ్రాండెడ్ బ్లాక్ టీ షర్ట్ లో సూపర్ లుక్ ఇచ్చాడు. దీంతో కె.ఎల్.రాహుల్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలోషేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోని కె.ఎల్.రాహుల్ షేర్ చేసిన కొంత కాలంలోనే దాదాపుగా నాలుగు లక్షల 15 వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హంగామా మొదలైంది.దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకి ప్రస్తుతం కె.ఎల్.రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.అయితే ఆరంభంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడగా ఊహించని రీతిలో ఓటమిపాలైంది.కానీ నిన్నటి రోజున బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కే.
ఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకి విజయాన్ని కట్టబెట్టాడు.కాగా ఈ నెల 27వ తారీఖున రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.
.