ప్రపంచ దేశాల ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు కరోనా వైరస్ వల్ల పూర్తిగా మారిపోయాయి.మరికొన్ని నెలలు ప్రజలు వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
అమెరికా, బ్రెజిల్ దేశాలతో పాటు భారత్ పై కూడా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ గజగజా వణుకుతోంది.
బ్రిటన్ ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది.కరోనా సోకిన వాళ్లు బయట తిరిగినట్లు తేలితే పదివేల పౌండ్ల (దాదాపు రూ.10 లక్షలు) జరిమానా విధిస్తామని పేర్కొంది. బ్రిటన్ లో రెండో దశ కరోనా ప్రారంభం కావడంతో ఆ దేశం నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 28 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
అధికారులు వైరస్ నిర్ధారణ అయిన వాళ్లు 10 నుంచి 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని కోరుతున్నారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల క్రితం రెండో దశ ప్రారంభమైందని చెప్పగా వైరస్ కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయడం మినహా మరో మార్గం లేదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.అయితే ఇదే సమయంలో బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిబంధనలను పాటించడం వల్ల ఎవరైనా ఉపాధి కోల్పోతే వారికి 500 పౌండ్లు ( 47 వేలు) ఇవ్వడానికి సిద్ధమవుతోంది.నిబంధనలు ఉల్లంఘించే వారికి 1,000 పౌండ్ల నుంచి జరిమానా ప్రారంభం కానుండగా రోగి సిబ్బందితో వ్యవహరించే తీరును బట్టి 10,000 పౌండ్ల జరిమానా విధిస్తారు.
ఈ నిబంధనల వల్ల రోడ్లపై తిరగాలంటే కరోనా రోగులు భయపడతారని, వైరస్ తగ్గుముఖం పడుతుందని బ్రిటన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.