నవమాసాలు మోసి కని పుట్టిన బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతల్లి, తనకు ఆడపిల్ల పుట్టిందనే బాధతో కసాయి తల్లి గా మారింది.ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించే ఈ సమాజంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావో.
భేటీ పడవో, సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాల ద్వారా స్ఫూర్తి నింపి చైతన్యం కలిగిస్తునప్పటికీ కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ నే ఉన్నారు.ఆడపిల్ల పుట్టగానే, వారిని అనంతలోకాలకు పంపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఖజూరి గ్రామానికి చెందిన సరిత అనే యువతి దేహరియ కాలానా గ్రామానికి చెందిన సచిన్ మేవాడ తో గత 14 నెలల క్రితం వివాహం జరిగింది.
అయితే గత నెల కిందట సరిత ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే తనకు కొడుకు కలగడం లేదని ఎంతో మనస్తాపానికి గురైన సరిత.
బుధవారం తన బిడ్డ కనిపించలేదు అంటూ బయటకు పరుగులు పెడుతూ స్థానికులకు తెలియజేసింది.ఆ సమయంలో భర్త పొలం పనులకు వెళ్లగా, తన అత్తామామలు ఆరుబయట ఉన్నారు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టగా కొద్దిసేపటికి సమీపంలో ఉన్న నీటి డ్రమ్ములో ఆ బిడ్డ విగతజీవిగా ఉండడం పోలీసులు గుర్తించారు.అయితే పోలీసులు సరితపై అనుమానంతో తమదైన శైలిలో గట్టిగా విచారణ చేపట్టగా, కొడుకు పుడతాడు అని ఎంతగానో మురిసిపోయిన తనకు కూతురు పుట్టడంతో సహించలేకపోయినట్టు అందుకే ఆమె నీటి డ్రమ్ములో వేసినట్టు ఒప్పుకుంది.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు.