మెగా అల్లుడితో స్టెప్పులేసిన రాజేంద్ర ప్రసాద్!

మెగా కుటుంబం నుంచి ఎంతో మంది యువ హీరోలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తమకంటూ ఒక ముద్ర వేసుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే మెగాస్టార్ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇదివరకే విజేత సినిమాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే.

 Rajendra Prasad, Dance, Kalyan Dev, Vijetha, Super Macchi-TeluguStop.com

అయితే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ “సూపర్ మచ్చి” సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

పులి వాసు దర్శకత్వంలో, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్ ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కన్నడ హీరోయిన్ రచిత రామ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కళ్యాణ్ సరసన నటించనున్నారు.అయితే కరోనా సమయంలో వాయిదా పడ్డ షూటింగ్, లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ తిరిగి చిత్రం షూటింగ్ ప్రారంభం చేశారు.

ఎన్నో హాస్యాస్పద సినిమాలలో హీరోగా నటించి, ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కళ్యాణ్ దేవ్ పై హైదరాబాదులో ఒక పాట చిత్రీకరించారు.కాసర్ల శ్యామ్ గారు ఈ పాటను రాయగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

ఈ పాట కాకుండా మరొక పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవ్వగా మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

సినిమా నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.

ఎస్ తమన్ సమకూర్చిన ఐదు పాటలు సూపర్ మచ్చి సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని వెల్లడించారు.సూపర్ మచ్చి సినిమా అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని తెలిపారు.

కాగా విజేత సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న కళ్యాణ్ దేవ్ మరోసారి సూపర్ మచ్చి సినిమా ద్వారా మరింత చక్కటి నటనతో అభిమానుల మనసు గెలుచుకుంటారా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube