నీకు మెంటలా అంటూ సీఐ కి వైసీపీ లేడీ ఎమ్మెల్యే వార్నింగ్ ?

ఎక్కడ ఏ వివాదం తలెత్తకుండా, ఏపీ సీఎం జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు.ప్రతిపక్షాలతో కూడా శభాష్ అనిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

 Ysrcp Mla Undavali Sridevi Warning On Ci Ys Jagan, Undavalli Sridevi, Ysrcp,-TeluguStop.com

కానీ జగన్ ఆలోచనను ఆ పార్టీ వారే పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంతో పాటు, అనవసర వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు.తాజాగా రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇదే విధంగా వివాదంలో చిక్కుకున్నారు.

ఇప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.ఎన్నికల సమయంలో ఓ కార్యకర్త నుంచి 1.40 కోట్లు తీసుకుని ఆ తర్వాత కొంత మొత్తం చెల్లించడం, మిగతా 80 లక్షలు చెల్లించాలని కోరుతున్నా, పట్టించుకోకుండా బెదిరింపులకు దిగినట్లు వార్తలు రావడం ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి.ఇవే కాకూండా పేకాట క్లబ్ నిర్వహణలోనూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

ఇదిలా ఉంటే, తాజాగా ఓ సీఐ కు ఎమ్మెల్యే శ్రీదేవి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆడియో క్లిప్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆడియోలో ఆమె సీఐ ను దూషిస్తున్న సంభాషణ ఉండడం, అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు ఆమె ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి వైరల్ అయ్యాయి.వాళ్లు నా మనుషులు వదిలి పెడతావా లేదా అంటూ ఆమె హెచ్చరించడం, నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్ళిపోతావు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో ఆ సంభాషణ హల్ చల్ చేస్తోంది.

” హలో నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా ? వాళ్లను పంపొచ్చు గా నీకేమైనా మెంటలా ? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేసానా లేదా ? ఏం మాట్లాడుతున్నావ్ ? నేనంటే రెస్పెక్ట్ లేదా ? అందరినీ వదిలిపెడతావ్.మా వాళ్ళను మాత్రం వదిలిపెట్టవా ? నాన్సెన్స్.అసలు నీవు పంపిస్తావా లేదా చెప్పు.

ఆరోజు నా కాళ్ళు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావ్, నేను చెప్పింది చేస్తానని ఆరోజు చెప్పావు.ఇప్పుడు ఎమ్మెల్యే ని అని చూడకుండా కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నావ్ నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు.

ఎగస్ట్రాలు చేయవద్దు మా వాళ్లను వదిలిపెట్టు, లేదంటే ఎస్పీకి ,డీజీపీకి చెబుతా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది.ఈ సందర్భంగా అక్రమంగా మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని సి ఐ చెబుతున్న మాటలు ఆడియో క్లిప్ లో ఉండడం, ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఈ వ్యవహారం వైసీపీ కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube