పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ పాలు తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.ఇది పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పాలలో ఉండే విటమిన్స్, క్యాల్షియం శరీరం పెరుగుదలకు, ఎముకలు బలంగా తయారయ్యేకి సహాయం అందిస్తుంది.ఇక దీనితో పాటు పాలలో కొద్దిగా పసుపు, మిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది చదివి తెలుసుకుందాం.
పసుపు ఇది లేనిదే ఏ వంట లో రుచి ఉండదు.
అలాగే ఏ శుభకార్యం తలపెట్టిన అది పసుపు తోనే మొదలవుతుంది.దీనికి గల కారణం పసుపు లో రోగనిరోధక శక్తి కలిగి ఉండడమే.
ఇది క్రిమినాశక ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నది.మన శరీరంలో ఏదైనా గాయం తగిలినప్పుడు దాని మీద పసుపు రాస్తూ ఉంటాం.
ఈ పసుపు ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది.అలాగే తొందరగా నయమవడానికి సహాయపడుతుంది.

దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే సమయంలో గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు, మిరియాల పొడిని కలుపుకుని తాగితే వాటి నుండి తొందరగా ఉపశమనం పొందడమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
పసుపుతో పాటు మిరియాలపొడిని కలిపి తాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మిరియాలను సుగంధ ద్రవ్యాల రారాజు అని కూడా పిలుస్తారు.దీనినే పాలలో రోజూ ఒక గ్లాసు తీసుకోవడం వల్ల మన ప్రేగులు ఇంకా శరీరాన్ని శుభ్ర పరచడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కా క్యాన్సర్ ను నివారించడంలోను హృదయ స్పందన రేటును పెంచడంలోను ఉపయోగపడుతుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పసుపు, మిరియాల పొడి పాలను వారానికి ఒకసారైనా తీసుకోండి.