నూతన్ నాయుడు అరెస్ట్... ఒకే సారి రెండు కేసుల్లో

విశాఖలో దళిత యువకుడుకి శిరోముండనం చేసిన ఘటన ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ వ్యవహారాన్ని పోలీసు శాఖ సీరియస్ గా తీసుకొని ఇప్పటికే అందులో బాధ్యులుగా నిర్ధారించి నూతన్ నాయుడు భార్యతో పాటు వారి ఇంట్లో పని చేసిన మరో ఆరుగురు వ్యక్తులని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 Visakhapatnam Police Arrests Nutan Naidu, Visakhapatnam, Bigg Boss Fame Nutan Na-TeluguStop.com

అయితే ఈ కేసుతో పాటు మరో కేసులో కూడా బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించారు.

నూతన్ నాయుడును కోర్టులో హాజరు పరిచామని వివరించారు.శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకి కూడా ప్రమేయం ఉందని నిర్ధారించుకున్నాక అతనికి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

దీంతో పటు అతనిపై మరో ఫిర్యాదు కూడా నమోదయ్యిందని అన్నారు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో డాక్టర్ సుధాకర్ కు నూతన్ నాయుడు ఫేక్ కాల్స్ చేశాడని సీపీ తెలిపారు.

మీ పేరుతో నాకు ఫోన్ కాల్ వచ్చిందని డాక్టర్ సుధాకర్ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ కు తెలిపారని, దాంతో పీవీ రమేశ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ వివరించారు.తన ఫోన్ నెంబర్ ను మరో వ్యక్తి వినియోగిస్తున్నట్టు రమేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.

తన పేరుతో ఫోన్లు చేస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఆయన పోలీసులను కోరారని, తాము దర్యాప్తు చేయగా అది నూతన్ నాయుడేనని తేలిందని సీపీ వెల్లడించారు.ఆ ఫోన్ నెంబర్ తో నూతన్ నాయుడు 30 మంది అధికారులతో మాట్లాడాడని అన్నారు.

సిమ్ ను ధ్వంసం చేయాలని కూడా నూతన్ నాయుడు ప్రయత్నించాడని, అయితే, నూతన్ నాయుడు నుంచి సిమ్ ను, ఫోన్ ను కర్ణాటక పోలీసులు ఎంతో చాకచక్యంగా సేకరించారని వివరించారు.మొత్తానికి నూతన్ నాయకుడు శిరోముండనం కేసుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారి పేరు వాడుకొని మోసాలకు పాల్పడిన కేసులో కూడా అడ్డంగా బుక్ అయ్యాడు.

దీంతో నీతులు చెప్పిన నూతన్ వెనుక ఇంత కథ ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube