బాలీవుడ్ క్రేజీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది.అందులో ఒక వర్గం బాలీవుడ్ మాఫియా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా, టాలెంట్ ఉన్నవాళ్ళని కూడా తొక్కేస్తూ నెపోటిజంని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు తెరపైకి తీసుకొచ్చారు.
వీటికి కంగనా రనౌత్ ఆజ్యం పోశారు.ఆజ్యం పోసి పోసి ఆ మంటని దావానంలా మార్చేసింది.
ఈ దావానం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది.ఇంతకాలం బాలీవుడ్ లో కొత్తవాళ్లుకి ప్రోత్సాహం ఉంటుందని భావించిన చాలా మంది అక్కడ కూడా బంధుప్రీతి, ఆధిపత్య పోరు కామన్ అని ఫిక్స్ అయిపోయారు.
అయితే జరుగుతున్న పరిణామాలపై భారత చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాసింది.
సుశాంత్ విషాదాంతాన్ని సినీ ఇండస్ట్రీతో పాటు సినీ పరిశ్రమ సభ్యుల ప్రతిష్ఠను మంటగలిపేలా కొందరు వాడుకుంటున్నారని ఆరోపించింది.అన్ని రంగాలలో లోపాలు ఉన్నాయని అయితే కేవలం బాలీవుడ్ కి మాత్రమే అవి పరిమితం అయినట్లు వ్యవహరించడం పరిశ్రమ మొత్తాన్ని ఒకే గాటనకట్టడం సరికాదని అభిప్రాయపడింది.
బాలీవుడ్ తో సంబంధంలేని ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని, ఇతర విభాగాలకు చెందిన ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎదిగారని వివరించింది.కానీ ఇండస్ట్రీలో కొత్తవారు ఎదగడం కష్టమంటూ ప్రచారం చేయడం తగదని హితవు పలికింది.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బాలీవుడ్ కొత్త ప్రతిభను ఆహ్వానించిందని తెలిపింది.