పిల్లలు తోబుట్టువుల కోసం ఏమైనా చేస్తారు.ఎందుకంటే వాళ్ళ ప్రేమలు అలా ఉంటాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఆరేళ్ళ బుడతడు తను ప్రాణంగా ప్రేమించే చెల్లిని కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పనంగా పెట్టాడు.మనకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే న్యూయార్క్ లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాలోని వ్యోమింగ్కి చెందిన బ్రిడ్జర్ వాకర్ అనే 6 ఏళ్ల బాలుడు చెల్లిని ఓ వీధికుక్క వెంబడించడంతో దాని నుండి ఆమెను కాపాడేందుకు బ్రీడర్ అడ్డంగా నిలబడ్డాడు.
దీంతో తన ముఖన్నీ కోరికేసింది.అయినప్పటికీ పారిపోకుండా చెల్లికి గాయం కాకుండా చూసుకున్నాడు.

ఇంకా ఆ కుక్క నుండి తనని దూరంగా తీసుకొని పారిపోయాడు.అయితే తన గాయాలను సరి చేసేందుకు వైద్యులకు దాదాపు రెండు గంటలు సర్జరీ చేశారు అని ఆ బాలుడి బంధువు ఒకరు ఇంస్టాగ్రామ్ లో తెలిపారు.అంతేకాదు ముఖం మీద మొత్తం 90 కుట్లు పడినట్టు అయన తెలిపారు.
అయితే కుక్క కరిచినా సమయంలో వెనక్కి పారిపోకుండా ఎందుకు నిలబడ్డావంటూ బాలుడుని ప్రశ్నించగా ”మా ఇద్దర్లో ఎవరైనా చనిపోవాల్సి వస్తే.
అది నేనే కావాలని అనుకున్నాను” అని చెప్పాడు ఆ బాలుడు.ఇంకా ఈ ఘటన వైరల్ అవ్వడంతో హాలీవుడ్ స్టార్ అన్నే హాత్వే మొదలు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ వరకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు.
ఇంకా ఈ 6 ఏళ్ల బాలుడికి ”గౌరవ ప్రపంచ చాంపియన్” గుర్తిస్తున్నట్టు ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ ట్విటర్లో ప్రకటించింది.