ఎక్కడో అడవుల్లో ఉండే పాములు ఈ మధ్యకాలంలో నగరాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే ఎప్పుడూ మనుషులేనా బైక్ మీద వెళ్ళేది మేము కూడా వస్తాము అంటూ ఈ మధ్య కాలంలో కొన్ని పాములు వాహనాల లోకి దూరి వాహన యజమానులు ఇబ్బంది పెడుతున్నాయి.
ఇదే నేపథ్యంలో తాజాగా ముంబై నగరంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఇంటి బయట వాహనాన్ని పార్కు చేయడంతో ఆ బైక్ ఇంజన్ లోకి పాము చేరుకుంది.
అయితే ఈ విషయాన్ని ఆ బైక్ యజమాని దారుడు గమనించలేదు.దీంతో ఆ బైక్ యజమాని బైక్ మామూలుగానే స్టార్ట్ చేసుకొని తన పని మీద బయటికి వెళ్ళాడు.
మంచి స్పీడ్ మీద వెళ్తున్న వాహనదారుడు తన బైక్ లో పాము ఉన్న విషయాన్ని గమనించలేదు.ఇంజన్ వేడెక్కిందేమో పాపం పాము తల బయట పెట్టి చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంది.
అయితే ఈ విషయాన్ని వాహనదారుడు ఏమాత్రం పట్టించుకోలేదు.
![Telugu Forest, Mumbai- Telugu Forest, Mumbai-](https://telugustop.com/wp-content/uploads/2020/07/one-snake-came-out-with-byke.jpg)
ఈ నేపథ్యంలో తన పక్కన వెళుతున్న ఓ వాహనదారుడు తన బైక్ లో పాము ఉందని గమనించి వాహనదారులకు చెప్పడంతో వెంటనే ఆ వాహనదారుడు బైక్ ను రోడ్డు పక్కన ఆపి కట్టెతో ఆ పాముని బయటికి నెట్టేశాడు.వెంటనే పక్కనే ఉన్న పొదల్లోకి ఆపాము తుర్రుమంది.దీంతో వాహనదారుడు దేవుడా బతికిపోయాం అని అనుకుంటూ బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.