మళ్లీ ట్రెండ్డింగ్‌ లో నిలిచిన జబర్దస్త్‌.. గ్యాప్‌ వచ్చినా ఆది అదే జోరు

కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా జబర్దస్త్‌ కొత్త ఎపిసోడ్స్‌ లేవు.మొదటి నుండి హిట్‌ అయిన ఎపిసోడ్స్‌ను ప్రసారం చేస్తు వస్తున్నారు.

 Jabardast Latest Promo,anasuya New Look, Jabardasth, Etv,lockdown,jabardasth Sho-TeluguStop.com

మూడు నెలల షూటింగ్‌ గ్యాప్‌ తర్వాత జబర్దస్త్‌ టీం ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించారు.కొన్ని మార్పులు, కొత్త టీంలకు ఛాన్స్‌ ఇచ్చిన మల్లెమాల వారు మరింత కొత్తగా జబర్దస్త్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

పెద్ద ఎత్తున జబర్దస్త్‌ కార్యక్రమం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు.

జబర్దస్త్‌ కార్యక్రమం కొత్త ప్రోమో యూట్యూబ్‌లో వచ్చింది.ఎప్పటిలాగే వచ్చిన కొన్ని గంటల్లోనే ట్రెండ్డింగ్‌లో నెం.1 గా జబర్దస్త్‌ ప్రోమో నిలిచింది.ఇక ఆది మళ్లీ దుమ్ము రేపుతున్నాడు.అద్బుతమైన కామెడీ పంచ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

రోజా వస్తుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో మళ్లీ ఆమె జడ్జ్‌గా వచ్చింది.ఆమెతో పాటు మనో గెస్ట్‌గా వచ్చాడు.
ఆది కామెడీ పంచ్‌లు అనసూయ కొత్త లుక్‌తో ఈ వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌ కామెడీ షో కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పెద్ద ఎత్తున సూపర్‌ హిట్‌ అయిన జబర్దస్త్‌ మూడు నెలల గ్యాప్‌ వచ్చినా కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే జోరుతో జబర్దస్త్‌ కామెడీ షో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవ్వడం చూసి ఇతర షో నిర్వాహకులు కుళ్లుకుంటూ ఉంటారంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube